నీకు కృతజ్ఞతలు: ఆరేళ్ల ఏళ్ల చిన్నారి లేఖకు మురిసిన సచిన్
హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా 'సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్'. మే 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై అలరించింది. హాలివుడ్ దర్శకుడు జెమ్స్ ఎర్సకైన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సచిన్ జీవితంలో తెలియని విషయాలను చూపించారు.
ఈ సినిమాకి సంగీతాన్ని ఏఆర్ రెహమాన్ అందించాడు. ఈ సినిమా అటు పెద్దలతో పాటు పిల్లలను కూడా ఎంతోగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాను చూసిన ఆరేళ్ల చిన్నారి తార సచిన్‌కు రాసిన లేఖ సోషల్ మీడియాలో మారుమ్రోగుతుంది. ఈ లేఖను సచిన్ స్వయంగా అభిమానులతో షేర్ చేసుకున్నాడు.

సచిన్ అంకుల్ అంటూ లేఖను మొదలుపెట్టిన చిన్నారి తార.. సినిమా గురించి పలు విషయాల్ని సచిన్‌తో షేర్ చేసుకుంది. మీరు చివరి మ్యాచ్ ఆడేటప్పుడు తనకు ఏడుపు వచ్చేసిందంటూ లేఖలో వివరించింది. మిమ్మల్ని, అంజలీ ఆంటీని కలవాలని ఉందంటూ ముగించింది.
ఈ లేఖను అందుకున్న సచిన్ తనదైన శైలిలో స్పందించాడు. 'ఈ లేఖ రాసినందుకు నీకు కృతజ్ఞతలు. నా సినిమా చూసి ఎంజాయ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడూ నవ్వుతూ ముందుకు సాగు' అని సచిన్ బదులిచ్చాడు. ఈ లేఖను సచిన్ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేయడంతో వైరల్ అయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications