India Squad for T20 WC: ముందే 20మంది ప్లేయర్లను సెట్ చేయాలి.. లేకపోతే చివర్లో పరేషనే: కోచ్ ద్రావిడ్

ఈ ఏడాది అక్టోబర్, నవంబరులో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం త్వరలో 20మంది ఆటగాళ్లతో కూడిన టీమిండియా ప్లేయర్ల జాబితాను వీలయినంత తొందరగా ఖరారు చేయాల్సిన అవసరం ఉందని భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ అభిప్రాయపడ్డారు. ఇక విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా టీ20 ప్రపంచ కప్ 2021లో గ్రూప్ దశలోనే ఇంటి బాట పట్టిన సంగతి తెలిసిందే. ఇక ఆ తదనంతరం విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్లకు కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. ఇక ఈసారి టోర్నమెంట్‌కు కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ, కొత్ కోచ్ ద్రావిడ్ ఆధ్వర్యంలో టీమిండియా టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఆడనుంది. ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్ సక్సెస్ ఫుల్‌గా నడిచింది.

దక్షిణాఫ్రికా సిరీస్ మినహా..
అయితే రోహిత్ గైర్హాజరీలో ఇటీవల దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ మాత్రమే సమమైంది. ఈ సిరీస్‌కు రోహిత్, కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా లాంటి స్టార్లకు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రిషబ్ పంత్ కెప్టెన్సీలో టీమిండియా దక్షిణాఫ్రికాను ఎదుర్కొంది. ఇక ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి రెండు గేమ్‌లలో యువ భారత జట్టు భారీ పరాజయాలను మూటగట్టుకుంది. ఇక తర్వాతి రెండు గేమ్‌లలో మంచి కమ్ బ్యాక్‌తో భారత్ జట్టు అద్భుతంగా పుంజుకుంది. రెండు మ్యాచ్‌లను గెలిచి సిరీస్ సమం చేసింది. చివరి గేమ్ వర్షం కారణంగా వాష్ అవుట్ కావడంతో సిరీస్ 2-2తో ముగిసింది.

ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో అర్థమైందేమో
ఇక తాజాగా దక్షిణాఫ్రికాతో సిరీస్లో ప్లేయర్ల ప్రదర్శనలను చూస్తున్న ద్రావిడ్‌కు మున్ముందు ప్లేయర్ల ఎంపికలో ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో అర్థమైనట్లు ఉంది. బుమ్రా, షమీ, కోహ్లీ, రోహిత్, రాహుల్ లాంటి స్టార్లు తిరిగి వస్తే.. జట్టులో ఎవరిని సెలక్ట్ చేయాలి.. ఎవరినీ తప్పించాలి అనే దాంట్లో చాలా సందిగ్ధత నెలకొనడం ఖాయం. ఇకపోతే ఐర్లాండ్‌లో జరిగే తదుపరి టీ20 సిరీస్‌కు హార్దిక్ పాండ్యా భారత జట్టుకు కెప్టెన్సీ వహించబోతున్నాడు. ప్రస్తుత టీ20ప్రపంచకప్‌కు ముందు జట్టు కూర్పులో నెలకొన్న సందిగ్ధతను క్లియర్ చేయాల్సిన ప్రాముఖ్యతను ద్రావిడ్ ప్రస్తావించాడు.

కచ్చితంగా త్వరలోనే 18నుంచి 20మంది ప్లేయర్లను సెట్ చేస్తాం
రాబోయే టీ20 వరల్డ్ కప్‌కు ముందు 18 నుంచి 20 మంది ఆటగాళ్లను ఇప్పటి నుంచి గుర్తించాల్సిన అవసరముందని పేర్కొన్నాడు. అలాగే టీ20 ప్రపంచకప్ స్క్వాడ్‌లో 15మంది కంటే ఎక్కువ ప్లేయర్లను ఎంచుకోకూడదని, తుది 15 మంది ఎవరో ఫిల్టర్ చేయాల్సిన అవసరాన్ని ద్రావిడ్ నొక్కి వక్కాణించాడు. ఇక జట్టులో కొందరు గాయాల పాలు కావడం వల్ల తుదిజట్టును ప్రకటించేందుకు కొంత అనుకూలతలు ఉన్నా.. కొంత ప్రతికూలతలు కూడా ఉన్నాయంటూ ద్రావిడ్ పేర్కొన్నాడు. ఇక ఎలాగోలా జట్టును త్వరగా ఖరారు చేస్తామనే నమ్మకం ఉందని ద్రావిడ్ చెప్పాడు. టీ20 ప్రపంచకప్ జట్టుకు 18నుంచి 20 మంది తుది ప్లేయర్ల లిస్టు.. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ తర్వాత జరుగుతుందా లేదా ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ తర్వాత జరుగుతుందా అనేది చెప్పడం కష్టం. కానీ కచ్చితం వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చూస్తున్నట్లు ద్రావిడ్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications