Aus Vs Sl 1st Test: నీకెమన్న బుద్ధుందా, రన్ కోసం పిలిచి ఇలా ఔట్ చేస్తావా? ఉస్మాన్ ఖవాజా మీద స్మిత్ ఫైర్

శ్రీలంక వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య గాలేలో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయాన్ 5వికెట్ల హాల్‌తో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 212పరుగులకే ఆలౌట్ అయింది. బుధవారం తొలి టెస్ట్ ప్రారంభం కాగా.. శ్రీలంక బ్యాటర్లు ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. వికెట్ కీపర్ డిక్వెల్లా (58పరుగులు) మినహా మిగతవాళ్లు తుస్సుమనిపించారు.
ఆసీస్ బౌలర్లలో స్వెప్సన్ 3, కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ 1, స్టార్క్ 1 వికెట్ తీశారు. ఇక తొలి రోజే శ్రీలంక ఆలౌట్ కావడంతో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ సైతం తడబడింది. 25ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయి తొలిరోజు 98పరుగులు మాత్రమే చేయగలిగింది. తద్వారా 114పరుగులు వెనకబడింది.
శ్రీలంక స్పిన్నర్ రమేష్ మెండిస్.. డేవిడ్ వార్నర్ (25), మార్నస్ లబూషేన్ (13)లను దొరకబుచ్చుకున్నాడు. క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్.. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా మధ్య సమన్వయం లోపించడంతో స్టీవ్ స్మిత్ (6పరుగులు) ఔటయ్యాడు. రనౌట్ అయ్యాక స్టీవ్ స్మిత్ ఫుల్ సీరియస్ అయ్యాడు. నీకేమన్న బుద్ధుందా అన్నట్లు ఖవాజాను చెడామడా తిట్టి నిరాశతో చేతులు ఊపుకుంటూ పెవిలియన్‌కు చేరుకున్నాడు.
అసలేం జరిగిందంటే..
రమేష్ మెండిస్ బౌలింగ్లో స్టీవ్ స్మిత్ ఫ్రంట్‌కొచ్చి ఆడాలని చూశాడు. బంతి మిస్సయి ప్యాడ్లకు తాకి ఆఫ్ సైడ్ వెళ్లింది. ఇక నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న ఖవాజా రన్ కోసం ముందుకొచ్చాడు. ఖవాజా రన్ కోసం వస్తుండడంతో స్మిత్ కూడా పరిగెట్టడం ప్రారంభించాడు. ఇద్దరు దాదాపు మధ్యలోకి వస్తున్న టైంలో ఖవాజా వెంటనే వెనక్కి పరిగెత్తాడు. దీంతో స్మిత్ సైతం తిరిగి క్రీజులోకి పరిగెత్తడం ప్రారంభించాడు. అంతలోనే కీపర్ పరిగెత్తుకుంటూ వెళ్లి బంతిని అందుకుని వికెట్ల వైపు విసరగా.. ఫీల్డర్ కుశాల్ మెండిస్ అందుకుని వికెట్లను గిరటేశాడు.
స్టీవ్ స్మిత్ డైవ్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో రనౌట్ అయిన కోపంలో స్టీవ్ స్మిత్ తీవ్ర నిరాశ చెందాడు. ఇక ఖవాజా వైపు చూస్తూ.. ఏంటీ బ్రో రన్ కోసం పరిగెత్తావ్.. మధ్యలోనే మళ్లీ వెనక్కి వెళ్లావ్.. ఇదేమైనా కరెక్టా అంటూ తీవ్రంగా వాదించాడు. నిరాశగా పెవిలియన్ వైపు కదిలాడు. ఇక ఉస్మాన్ ఖవాజా కూడా చాలా గిల్టీగా ఫీలయ్యాడు.

వర్షం వల్ల ఆలస్యమైన ఆట..
ఇక రెండో రోజు గాలులతో వర్షం పడడంతో వర్షం మధ్యాహ్నం వరకు ప్రారంభం కాలేదు. ఇక మ్యాచ్ ప్రారంభమయ్యాక ఉస్మాన్ ఖవాజా (71పరుగులు) కాసేపు ప్రతిఘటించాడు. కానీ అతన్ని వండర్ సే క్యాచ్ ఔట్ చేశాడు. ఇక ట్రెవిస్ హెడ్ (6) సైతం పెద్దగా క్రీజులో నిలబడలేకపోయాడు. ఇక 5వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 43ఓవర్లకు 186పరుగులు చేసింది. ఇంకా 26పరుగుల వెనకల ఉంది. ఇక క్రీజులో కామెరున్ గ్రీన్ (36), అలెక్స్ కెరీ (18) క్రీజులో కొనసాగుతున్నారు.

తుది జట్లు
శ్రీలంక : పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే (కరుణరత్నే), కుసల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, దినేష్ చండిమాల్, నిరోషన్ డిక్వెల్లా (వికెట్ కీపర్), రమేష్ మెండిస్, జెఫ్రీ వాండర్సే, లసిత్ ఎంబుల్దేనియా, అసిత ఫెర్నాండో
ఆస్ట్రేలియా : ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్, మార్నస్ లాబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, మిచెల్ స్వెప్సన్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications