Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2022: రిషబ్ పంత్‍కు ఏమైంది.. వైరల్ అవుతోన్న ఫొటో..

A photo of Indian wicketkeeper Rishabh Pant wearing a heel pad is going viral on social media

భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ వెటరన్ దినేష్ కార్తీక్ తిరిగి భారత జట్టులోకి వచ్చినప్పటి నుంచి చాలా వరకు బెంచ్ కే పరిమితం అవుతున్నాడు. T20I జట్టులో పంత్ క్రమం తప్పకుండా ఆడకపోయినా అతను జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆస్ట్రేలియాలో జరిగే ICC T20 ప్రపంచ కప్ 2022 మ్యాచ్‌లలో ఆడతాడని చెప్పాడు. అయితే తాజాగా రిషబ్ పంత్ కు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మోకాలి హీల్ ప్యాడ్
సోమవారం గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన భారత వార్మప్ మ్యాచ్‌లో మోకాలి హీల్ ప్యాడ్ ధరించి పంత్ కనిపించాడు. ఈ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వెంటనే అది వైరల్‌గా మారింది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ గాయంపై భారత క్రికెట్ జట్టు అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అంతకుముందు టీ20 ప్రపంచకప్‌ నుంచి జస్ప్రీత్ బుమ్రా ఔట్ కావడంతో భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

రవీంద్ర జడేజా
రవీంద్ర జడేజా కూడా గాయం కారణంగా వరల్డ్ కప్ కు దూరమయ్యాడు. రిషబ్ పంత్ మోకాలి హీల్ ప్యాడ్ ధరించి కనిపించడంపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. సోమవారం ది గబ్బా వేదికగా జరిగిన ICC పురుషుల T20 ప్రపంచకప్‌లో తమ మొదటి వార్మప్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను భారత్ ఆరు పరుగుల తేడాతో ఓడించింది. మహ్మద్ షమీ ఆఖరి ఓవర్‌లో చెలరేగి మూడు వికెట్లు పడగొట్టాడు.

Story first published: Tuesday, October 18, 2022, 12:41 [IST]
Other articles published on Oct 18, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+