
విరాట్ కోహ్లీ తన మొట్టమొదటి టీ20శతకం సాధించడంతో మూడేళ్ల సెంచరీ నిరీక్షణకు తెరపడింది. 70సెంచరీలు చేసిన కోహ్లీ మూడేళ్ల పాటు సెంచరీ చేయకపోవడంతో పాటు పేలవ ఫామ్ కొనసాగించిన సంగతి తెలిసిందే. అతని సెంచరీ కోసం కోహ్లీ అభిమానులు ఎంతో వేచి చూశారు. కోహ్లీ సెంచరీ కొట్టాక నగరాల్లో పలు వీధుల్లో బాణాసంచాలు, పటాకులు కొట్టి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ (61బంతుల్లో అజేయంగా 122పరుగులు) చేశాడు. కేఎల్ రాహుల్‌తో కలిసి బ్యాటింగ్ ప్రారంభించి.. ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించాడు.
టీ20ల్లో అత్యధిక స్కోరు సాధించిన భారత బ్యాటర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. ఇక సెంచరీ చేసిన అనంతరం కోహ్లీ చాలా ఆశ్చర్యపోయాడు. ఇక అతను సంబరాలు చేసుకుంటున్న సమయంలో కోహ్లీ వెనకాల స్టాండ్స్‌లో ఉన్న ఓ వృద్ధుడిపై కెమెరా మాన్ ఫోకస్ పెట్టాడు. సదరు వృద్ధుడు కోహ్లీకి టేక్ ఏ బో చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరలైంది. అతను టేక్ ఏ బో చెబుతున్నప్పడు ఫేసులో కన్పించిన సంతోషం వెలకట్టలేనిది. కోహ్లి బ్యాక్ టు బ్యాక్ బంతుల్లో ఒక ఫోర్, సిక్స్‌తో సెంచరీ మార్కును చేరుకున్నాడు.
ఇక ఈ మ్యాచ్ సంగతికొస్తే.. భారత పూర్తి స్థాయి కెప్టెన్ రోహిత్‌కు టీం మేనేజ్‌మెంట్ రెస్ట్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరించాడు. భారత్ టాస్ ఓడిపోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన కోహ్లీ (122పరుగులు 61బంతుల్లో 12ఫోర్లు, 6సిక్సర్లు నాటౌట్), కేఎల్ రాహుల్ (62పరుగులు 41బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సులు) దండయాత్ర మొదలెట్టారు. చివర్లో పంత్ (20పరుగులు) పర్వాలేదనిపించాడు. దీంతో స్కోరు 2వికెట్లు కోల్పోయి 212పరుగులకు చేరుకుంది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘన్ భువీ కెరీర్ బెస్ట్ బౌలింగ్ (5/4) 5వికెట్ల హాల్ దెబ్బకు ఆఫ్ఘన్ కుప్పకూలింది. 111పరుగులకే పరిమితమైంది. దీంతో ఇండియా 101పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.