
ఆస్ట్రేలియాలోని పెర్త్ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్లోని తొలి టీ20 జరగగా.. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను 8పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఓడించింది. చివరి ఓవర్ వరకు తీవ్ర ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరికి ఇంగ్లాండ్‌దే పైచేయి అయింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 తేడాతో ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని సంపాదించింది. ఈ మ్యాచ్ ద్వారా పునరాగమనం చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ (68పరుగులు 32బంతుల్లో 8ఫోర్లు, 4సిక్సర్లు) తన మాస్ ఇన్నింగ్స్‌తో అలరించగా.. మరో ఓపెనర్ అలెక్స్ హేల్స్ (84పరుగులు 51బంతుల్లో 12ఫోర్లు, 3సిక్సర్లు) వీరవిహారం చేశాడు. దీంతో ఇంగ్లాండ్ 208 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. ఛేదనలో ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (54 బంతుల్లో 73 పరుగులు 8ఫోర్లు, 2సిక్సర్లు) గట్టి ప్రతిఘటన కనబర్చినప్పటికీ ఆసీస్ విజయానికి 8పరుగుల దూరంలో ఆగిపోయింది. హేల్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఆసీస్ విజయానికి చివరి ఓవర్‌లో 16పరుగులు అవసరం కాగా.. ఫాస్ట్ బౌలర్ సామ్ కరన్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లాండ్‌ను గట్టెక్కించాడు. క్రీజులో ప్రమాదకర హిట్టర్ అయిన మాథ్యూ వేడ్ ఉండడంతో ఆసీస్ గెలుపు సాధ్యమేననిపించింది. తొలి బంతికి అనుకున్నట్లుగానే వేడ్ ఫోర్ కొట్టాడు. దీంతో సమీకరణం 5బంతుల్లో 12గా మారింది. రెండో బంతికి డాట్ బాల్. మూడో బంతికి స్టోక్స్ పట్టిన అద్భుత క్యాచ్‌కు వేడ్ ఔటవ్వడంతో ఆసీస్ గెలుపు ఆశలు ఆవిరయ్యాయి. నాలుగో బంతికి సింగిల్, అయిదో బంతికి నాథన్ ఎల్లిస్ బౌల్డ్ అయ్యాడు. దీంతో చివరి బంతికి రెండు పరుగులు మాత్రమే రావడంతో ఆ ఓవర్లో కేవలం 8పరుగులే వచ్చాయి. ఫలితంగా 8పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం ఖాయమైంది. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ 3వికెట్లతో ఆకట్టుకోగా.. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ మూడు వికెట్లతో రాణించాడు.
ఇరు జట్లు :
ఆస్ట్రేలియా : డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), డేనియల్ సామ్స్, నాథన్ ఎల్లిస్, కేన్ రిచర్డ్సన్, మిచెల్ స్వెప్సన్
ఇంగ్లాండ్ :
జోస్ బట్లర్ (కెప్టెన్ & వికెట్ కీపర్), అలెక్స్ హేల్స్, డేవిడ్ మలన్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, మోయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్