Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్‌లో విండీస్ పర్యటిస్తోన్న వేళ..: కీరన్ పొల్లార్డ్ అదృశ్యం: పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ..

A missing Photo of West Indies Captain Kieron Pollard has gone viral, Dwayne Bravo also shared

అహ్మదాబాద్: భారత్‌తో మూడో వన్డే కోసం వెస్టిండీస్ జట్టు సమాయాత్తమౌతోంది. ఇంకొన్ని గంటల్లో మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మధ్యాహ్నం 1:30 నిమిషాలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రెండు జట్లు తలపడనున్నాయి. ఈ సిరీస్‌లో చివరి వన్డే మ్యాచ్ ఇది. ఈ నెల 6, 9 తేదీల్లో జరిగిన తొలి రెండు వన్డేల్లోనూ రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది. మూడు వన్డేల ఈ సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది.

గెలుపు కోసం ఇరు జట్లూ..

గెలుపు కోసం ఇరు జట్లూ..

మూడో వన్డేలోనూ జయకేతనాన్ని ఎగురవేయాలనే పట్టుదలను ప్రదర్శిస్తోంది టీమిండియా. వైట్ వాష్ కోసం వ్యూహాలు సిద్ధం చేస్తోంది. కరేబియన్ పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంటోంది. తొలి రెండు వన్డేల్లోనూ ఘోర పరాజయంతో డీలా పడింది. ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయింది. చివరి వన్డేలోనైనా గెలిచి, పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. ఈ రెండు జట్లు కూడా అహ్మదాబాద్ స్టేడియంలో ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొంటోన్నాయి.

వైరల్‌గా మారిన పొల్లార్డ్ పిక్..

వైరల్‌గా మారిన పొల్లార్డ్ పిక్..

ఈ పరిస్థితుల మధ్య- వెస్టిండీస్ సారథి కీరన్ పొల్లార్డ్ అదృశ్యం అయ్యాడనే ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్ అభిమానులను ఉలిక్కిపడేలా చేస్తోంది. ఈ ఫొటోను షేర్ చేసింది డ్వేన్ బ్రావో. తన అఫీషియల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో దీన్ని పోస్ట్ చేశాడు. కీరన్ పొల్లార్డ్ కనిపించట్లేదని, ఆచూకీ తెలిసిన వారు వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు సమాచారాన్ని ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశాడు. దీన్ని తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.

చాహల్ పాకెట్‌లో..

చాహల్ పాకెట్‌లో..

కీరన్ పొల్లార్డ్ వ్యక్తిగత వివరలన్నింటినీ ఈ ఫొటోలో పొందుపరిచాడు. వయస్సు 34 సంవత్సరాలు.. ఎత్తు 1.85 సెంటీమీటర్లుగా వివరించాడు. చివరిసారిగా యజువేందర్ చాహల్ పాకెట్‌లో కనిపించాడని, ఆ తరువాత అదృశ్యం అయ్యాడని పేర్కొన్నాడు. అతని ఆచూకీ తెలిసిన వారు వెంటనే వెస్టిండీస్ క్రికెట్ బోర్డును సంప్రదించాలని, లేదా- తనకు ఇన్‌బాక్స్ చేయాలని సూచించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫర్వాలేదని కోరాడు. పొల్లార్డ్ తన బెస్ట్ ఫ్రెండ్ అని అభివర్ణించాడు.

 డ్వేన్ బ్రావో సెటైరిక్

డ్వేన్ బ్రావో సెటైరిక్

నిజానికి- ఇదో సరదా పోస్ట్ మాత్రమే. కీరన్ పొల్లార్డ్ ఫెయిల్యూర్స్‌ను డ్వేన్ బ్రావో ఈ రకంగా ప్రజెంట్ చేశాడు. భారత్‌తో జరిగిన తొలి వన్డేలో కీరన్ పొల్లార్డ్ డకౌట్ అయిన విషయం తెలిసిందే. యజువేందర్ చాహల్ బౌలింగ్ క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. అది అతని గోల్డెన్ డక్. ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ అయ్యాడీ విండీస్ కేప్టెన్. రెండో వన్డేకు దూరం అయ్యాడు. గాయం వల్ల రెండో వన్డేలో ఆడలేదు. డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితం అయ్యాడు.

మూడో వన్డేకు రెడీ..

మూడో వన్డేకు రెడీ..

దీన్ని దృష్టిలో ఉంచుకుని డ్వేన్ బ్రావో సరదాగా ఈ పోస్ట్ చేశాడు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలావుండగా- కీరన్ పొల్లార్డ్ గాయం నుంచి కోలుకున్నాడు. ఇవ్వాళ్టి వన్డే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటోన్నాడు. పించ్ హిట్టర్‌గా పేరున్న కీరన్ పొల్లార్డ్.. ఈ మ్యాచ్‌లో ఎలా ఆడతాడనే విషయం మీదే విండీస్ జట్టు గెలుపోటములు ఆధారపడి ఉన్నాయనడంలో సందేహాలు అక్కర్లేదు. జేసన్ హోల్డర్ వంటి ఒకరిద్దరు మినహా ఆ జట్టులో ఎవరూ పెద్దగా రాణించట్లేదు.

Story first published: Friday, February 11, 2022, 8:23 [IST]
Other articles published on Feb 11, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+