T20 World Cup 2022: కీలక మ్యాచ్‍కు సిద్ధమైన ఇంగ్లాండ్.. శ్రీలంకతో తలపడనున్న ఆఫ్ఘాన్..

టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా మంగళవారం రెండు మ్యాచ్ లు జరగునున్నాయి. గ్రూప్-1లో ఆఫ్ఘానిస్తాన్ తో శ్రీలంక తలపడనుంది. ఈ మ్యాచ్ బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియంలో ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇదే గ్రూప్ లో మరో మ్యాచ్ న్యూజిలాండ్, ఇంగ్లాండ్ కు మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కూడా ఇదే స్టేడియంలో మధ్యాహ్నం ఒంటి గంట 30 నిషాలకు ప్రారంభం అవుతుంది.

ఇంగ్లాండ్
న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ ఇంగ్లాండ్ కు కీలకం కానుంది. ఇంగ్లాండ్ కు ఈ మ్యాచ్ లో గెలిస్తేనే సెమీస్ కు వెళ్లే అవకాశం ఉంటుంది. గ్రూప్-1లో న్యూజిలాండ్ 5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా 5 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మూడు పాయింట్లతో ఇంగ్లాండ్ మూడో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ తో పాటు శ్రీలంకతో జరిగే మ్యాచ్ లో గెలిస్తే సెమీస్ అవకాశాలు ఉంటాయి. ఇంగ్లాండ్ రెండు మ్యాచ్ లు గెలిచి.. ఆస్ట్రేలియా ఆఫ్ఘానిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో ఓడిపోతే నేరుగా సెమీస్ వెళ్తుంది.

ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా ఆప్ఘానిస్తాన్ పై గెలిస్తే రన్ రేట్ ఎక్కువున్న జట్టు సెమీస్ కు వెళ్తుంది. ఇక న్యూజిలాండ్ సెమీస్ కు వెళ్లడం దాదాపు ఖాయమైంది. కివీస్ ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ లో ఓడిపోతే.. తర్వాత ఐర్లాండ్ తో జరిగే మ్యాచ్ లో గెలవాలి. ఒక వేళ రెండు మ్యాచు లు గెలిస్తే ఎలాంటి సందేహం లేకుండా న్యూజిలాండ్ సెమీస్ కు వెళ్తుంది. ఇక శ్రీలంక ఆఫ్ఘానిస్తాన్ మ్యాచ్ ను నా మాత్రం మ్యాచ్ గా చూడొచ్చు.

శ్రీలంక, ఆఫ్ఘానిస్తాన్
ఇప్పటికే ఈ జట్లు దాదాపు సెమీస్ కు వెళ్లే అవకాశాలను కోల్పోయాయి. గ్రూప్-1లో శ్రీలంక మూడు మ్యాచ్ లు ఆడి ఒక్క మ్యాచ్ లో విజయం సాధించింది. రెండింటిలో ఓడిపోయింది. శ్రీలంక 2 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. ఆఫ్ఘానిస్తాన్ మూడు మ్యాచ్ ల్లో ఒక మ్యాచు లో ఓడిపోగా.. మిగతా రెండు మ్యాచ్ లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. దీంతో ఆ జట్టు 2 పాయింట్లతో చివరి స్థానంలో ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications