For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అచ్చం ఎంఎస్ ధోనీలాగే.. బుడ్డోడు హెలికాప్టర్‌ షాట్‌ ఇరగదీశాడుగా! చూస్తే షాకే (వీడియో)!!

A Little Kid plays MS Dhonis helicopter shot with ease

హైదరాబాద్: క్రికెట్‌ చరిత్రలో 'హెలికాఫ్టర్ షాట్' అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ. మెరుపు వేగంతో దూసుకువచ్చే యార్కర్‌ని అంతేవేగంతో తిరిగి బాదడమే ఈ షాట్‌ ప్రత్యేకత. బ్యాట్‌ను హెలికాఫ్టర్ రెక్కల్లా గుండ్రగా తిప్పుతూ ధోనీ కొట్టే సిక్సులు చాలా ఫేమస్. మహీ ఈ షాట్ కొడితే.. కచ్చితంగా బంతి స్టాండ్స్‌లోకి వెళ్లాల్సిందే. మహీ ప్రవేశపెట్టిన ఈ షాట్‌ను ఎందరో క్రికెటర్లు ఆడేందుకు ప్రయత్నించారు. వీరిలో కొందరు సఫలమైతే.. మరి కొందరికి మాత్రం పరాభవం తప్పలేదు. అయితే ఓ బుడ్డోడు అచ్చం ధోనీలాగా హెలికాప్టర్‌ షాట్లను అలవోకగా బాదుతూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు.

కళ్లుచెదిరే రీతిలో హెలికాప్టర్ షాట్:

భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఓ బుడ్డోడు అలవోకగా హెలికాప్టర్ షాట్ ఆడుతున్న వీడియోని శుక్రవారం సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తలకు హెల్మెట్‌ పెట్టుకుని, కాళ్లకు ప్యాడ్లు కట్టుకుని ప్రొఫెషనల్‌ క్రికెటర్‌ వేషధారణలో మైదానంలో క్రికెట్‌ ఆడాడు ఆ బుడ్డోడు. వచ్చిన బంతిని వచ్చినట్టే బలంగా బాదుతూ కనిపించాడు. ఈ క్రమంలో పాదాల వద్ద యార్కర్ రూపంలో పడిన ఓ బంతిని కళ్లుచెదిరే రీతిలో హెలికాప్టర్ షాట్ ఆడాడు. హెలికాప్టర్ షాట్లతో పాటు లెగ్‌ సైడ్‌ దిశగా ఆడే స్లాగ్‌ స్వీప్‌ని కూడా సునాయాసంగా ఆడాడు. ఒక మోకాలిని నేలకు తాకించి బౌలర్‌ తలమీదుగా కూడా ఇంకో షాట్‌ ఆడాడు.

కామెంట్రీ కూడా:

కామెంట్రీ కూడా:

బుడ్డోడి బ్యాటింగ్‌కి ఆకాశ్ చోప్రా తన కామెంట్రీని కూడా యాడ్ చేశాడు. అచ్చం ఎంఎస్ ధోనీలాగా హెలికాప్టర్‌ షాట్లను అలవోకగా బాదుతూ ఆ పిల్లాడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. బుడ్డోడి బ్యాటింగ్‌కి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియోకు ఇప్పటికే లక్షల్లో లైకులు, కామెంట్లు వచ్చాయి. అంతేకాదు షాట్ ఆడిన కుర్రాడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఆలస్యం ఎందుకు మీరు ఓ లుక్కేయండి. చూస్తే మాత్రం కచ్చితంగా చూస్తే షాక్ అవుతారు.

ఔటవడమే కాకుండా.. గాయపడే ప్రమాదం:

ఔటవడమే కాకుండా.. గాయపడే ప్రమాదం:

ఎంఎస్ ధోనీ తరహాలో హెలికాప్టర్ షాట్‌ ఆడాలని చాలా మంది క్రికెటర్లు ప్రయత్నించారు. కానీ ఓ ఐదారురు మాత్రమే ఇప్పటి వరకూ ఆ షాట్‌పై ఫర్‌ఫెక్షన్ సాధించారు. అందులో హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, రషీద్ ఖాన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ ముందు వరుసలో ఉన్నారు. ముఖ్యంగా పంత్ ప్రతి మ్యాచ్‌లోనూ కనీసం ఒక్క హెలికాప్టర్ షాట్ అయినా ఆడేందుకు ప్రయత్నిస్తుంటాడు. సక్సెస్ కూడా అవుతుంటాడు. అవగాహన లేకుండా హెలికాప్టర్ షాట్ ఆడితే బ్యాట్స్‌మెన్ ఔటవడమే కాకుండా.. గాయపడే ప్రమాదాలు చాలా ఎక్కువ. అందుకే చాలా మంది క్రికెటర్లు ఆ షాట్ ఆడే సాహసం చేయడం లేదు.

 జట్టులోకి వచ్చిన కొత్తలో:

జట్టులోకి వచ్చిన కొత్తలో:

ఎంఎస్ ధోనీ భారత జట్టులోకి వచ్చిన కొత్తలో ప్రతి మ్యాచ్‌లోనూ కనీసం ఒక హెలికాప్టర్ షాట్ ఆడేవాడు. ఆ తర్వాత కెప్టెన్సీ భారంతో గత కొన్నేళ్లుగా ఆ షాట్‌ని మహీ ఎక్కువగా ఆడటం లేదు. వెన్నునొప్పి గాయం కూడా ఆ షాట్ ఆడకపోవడానికి ఒక కారణం అని తెలుస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన మహీ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాప్ ఆర్డర్ బలంగా ఉండడంతో.. ధోనీ మెరుపులు చూసే అవకాశం అభిమానులకు పెద్దగా రాలేదు. కరోనా కారణంగా మిగిలిన 31 మ్యాచ్‌లు సెప్టెంబరు-అక్టోబరులో యూఏఈలో జరగనున్నాయి.

Story first published: Saturday, June 5, 2021, 13:48 [IST]
Other articles published on Jun 5, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+