
ధోనీకి కార్లు, బైక్‌లు అంటే ప్రాణం
ధోనీకి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో.. కార్లు, బైక్‌లు అంటే కూడా అంతే ప్రాణం. ధోనీ మార్కెట్లోకి వచ్చిన వెరైటీ బైక్, కార్లను కొనుగోలు చేస్తుంటాడు. అయితే ఈ సారి ధోనీ కొన్న కారు కాస్త విభిన్నంగా ఉంది. భారత సైనికులు ఉపయోగించే 'నిసాన్ జోంగా' మోడల్ జీపును మహీ కొనుగోలు చేసాడు. ధోనీ ఆదివారం రాంచీ వీధుల్లో కొత్తగా కొన్న నిసాన్ జోంగా జీపును నడుపుతూ ఆస్వాదించాడు.

పెట్రోల్ బంకు వద్దకు
ధోనీ జీపు నడుపుతూ తన ఇంటికి సమీపంలోని ఓ పెట్రోల్ బంకు వద్దకు వెళ్లాడు. అక్కడ ధోనీని చూసిన అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. పెట్రోల్ బంకులో అభిమానులు ధోనీ వద్దకు చేరుకుని ఫొటోలు దిగేందుకు ప్రయతించారు. అభిమానులను నిరుత్సాహపరచకుండా సెల్ఫీలు దిగి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు. అనంతరం అక్కడి నుండి వెళ్ళిపోయాడు.పెట్రోల్ బంకు వద్దకు
ధోనీ జీపు నడుపుతూ తన ఇంటికి సమీపంలోని ఓ పెట్రోల్ బంకు వద్దకు వెళ్లాడు. అక్కడ ధోనీని చూసిన అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. పెట్రోల్ బంకులో అభిమానులు ధోనీ వద్దకు చేరుకుని ఫొటోలు దిగేందుకు ప్రయతించారు. అభిమానులను నిరుత్సాహపరచకుండా సెల్ఫీలు దిగి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు. అనంతరం అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

చెరోకీ భారత్‌లోనే అత్యంత ఖరీదైన కారు
గత నెల సెప్టెంబర్‌లోనూ ధోనీ భారత తొలి గ్రాండ్ చెరోకీ జీపును కొన్న విషయం తెలిసిందే. ఆ జీపు ఇంటికి వచ్చిన సమయంలో ధోనీ సైనిక విధుల్లో ఉండటంతో.. తిరిగి వచ్చిన వెంటనే అందులో చక్కర్లు కొట్టాడు. చెరోకీ భారత్‌లోనే అత్యంత ఖరీదైన, ఏకైక కారు. ఈ కారు ధర రూ.1.12 కోట్లు (ఎక్స్-షోరూమ్ ధర). గ్రాండ్ చెరోకీ ఎస్‌ఆర్‌టీ 2017లో అమెరికాలో లాంచ్ చేశారు. 3.62 సెకండ్ల వ్యవధిలో వంద కిలో మీటర్ల వేగం అందుకునే ఎస్‌యూవీలలో ఇది ఒకటి.

అతిపెద్ద గ్యారేజ్
ధోనీ ఇప్పటికే తాను సేకరించిన కార్లు, బైక్‌ల కోసం సొంతంగా అతిపెద్ద గ్యారేజ్‌ను ఏర్పాటు చేసుకొన్నాడు. ధోనీ గ్యారేజ్‌లో ఫెరారీ 599 జీటీవో, హమ్మర్ హెచ్ -2, జీఎంసీ సియారా, కవాసకీ నింజా హెచ్ -2, కాన్ఫెడరేట్ హెల్ క్యాట్, బీఎస్ ఏ, సుజికీ హయాబుషా, నోర్టాన్ వింటేజ్ లాంటి అరుదైన బ్రాండ్లు డజన్లు కొద్ది ఉన్నాయి.

క్రికెట్‌కు తాత్కాలిక విరామం
ప్రపంచకప్ అనంతరం ధోనీ క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించాడు. భారత ఆర్మీకి సేవలందిచాలనే ఉద్దేశంతో వెస్టిండీస్ పర్యటనకు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌కు కూడా అందుబాటులో లేడు. నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. ప్రస్తుతం ధోనీ కుటుంబంతో గడుపుతున్నాడు.


Click it and Unblock the Notifications












