Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2022: కొడితే స్టేడియం అవతల పడింది.. వైరల్ అవుతోన్న

A huge six hit by the West Indies player Powell went beyond the stadium

పిచ్ హిట్టర్లకు వెస్టిండీస్ పెట్టింది పేరు.. క్రిస్ గేల్ నుంచి పావెల్ వరకు భారీ సిక్స్ కొట్టగల సమర్థులు. ఒక్కో సారి ఈ సిక్స్ లు స్టేడియం అవతల పడతాయి కూడా. తాజాగా హోబర్ట్ వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ తొలి రౌండ్‌ మ్యాచ్ సందర్భంగా పావెల్ భారీ సిక్స్ కొట్టాడు. ఈ సిక్స్ స్టేడియం అవతల పడింది. ఇందుకు సంబంధిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.జింబాబ్వేతో జరిగిన ఈ మ్యాచ్ లో రోవ్‌మన్ పావెల్ 28 పరుగులు చేశాడు.

104 మీటర్లు
పావెల్ వేగంగా బ్యాటింగ్ చేశాడు. రెండు సిక్సర్లు కొట్టాడు. పావెల్ కొట్టిన సిక్స్ 104 మీటర్ల దూరం వెళ్లింది. డీప్ స్క్వేర్ లెగ్ రీజియన్‌పై కొట్టిన భారీ సిక్స్ ను చూసి సహచరుడు అకేల్ హోసేన్‌ షాక్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో అకేల్ హొసైన్ 23 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవరల్లో 153 పరుగులు చేసింది. చార్లెస్ 36 బంతుల్లో 2 సిక్స్ లు, 3 ఫోర్లతో 45 పరుగులు చేశాడు.

122 పరుగులకే ఆలౌట్
జింబాబ్వే బౌలర్లలో రజా మూడు వికెట్లు పడగొట్టగా.. ముజరబాని 2 వికెట్లు తీశాడు. విలియమ్స్ ఒక వికెట్ పడగొట్టాడు. 154 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 18.2 ఓవర్లలో 122 పరుగులకే ఆలౌట్ అయింది. జింబాబ్వే ఆటగాళ్లలో ల్యూక్ జోంగ్వే 29 పరుగులు చేయగా.. వెస్లీ మాధేవేరే 27 పరుగులు చేశాడు. వెస్టిండీస్ బౌలర్లలో అజారి జోసఫ్ 4 వికెట్లు పడగొట్టగా.. హోల్డర్ 3 వికెట్లు తీశాడు. హుస్సేన్, ఒడియన్ ఒక్కో వికెట్ పడగొట్టాడు.

Story first published: Wednesday, October 19, 2022, 17:31 [IST]
Other articles published on Oct 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+