Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీని అవమానించలేదు.. అసలు వీడియో చూడండి- నితీశ్ రెడ్డి (Video)

దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనీపై తాను చేసిన వ్యాఖ్యలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి వివరణ ఇచ్చాడు. ధోనీ పట్ల తనకి అపారమైన గౌరవం ఉందని, కొందరు కావాలనే తన గురించి దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నాడు. ఇంటర్వ్యూ పూర్తిగా చూడకుండా వీడియోను ఎడిట్ చేసి నెగటివ్‌గా వ్యాప్తి చేస్తున్నారని తెలిపాడు.

అసలేం జరిగిదంటే.. యువ హీరో కార్తికేయ గుమ్మకొండ‌తో నితీశ్ కుమార్ రెడ్డి ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇటీవల విడుదల అయిన భజే వాయు వేగం మూవీ ప్రమోషన్‌లో భాగంగా నితీశ్‌తో కార్తీకేయ సరదాగా ముచ్చటించారు. క్రికెట్, క్రికేటరత విషయాలు చర్చించారు. అయితే నితీశ్‌ను కార్తీకేయ ఓ ప్రశ్న అడిగారు.

A Huge Admirer of MS Dhoni Urges Against Spreading Negativity- Nitish Kumar Reddy

'ప్లేయర్ల ప్రదర్శన చూస్తుంటే కొందరికి నైపుణ్యం సహజ సిద్ధంగా వచ్చిందని, మరికొందరు కష్టపడి, శ్రమించి ఆ నైపుణ్యాన్ని సంపాదించారని అనిపిస్తుంటుంది. దీనిలో ఏదీ ఎక్కువగా విజయవంతం అవుతుంది?' అని నితీశ్‌ను కార్తికేయ ప్రశ్నించారు. దీనికి నితీశ్ ఉదాహరణలతో సమాధానమిస్తూ, అన్నింటికంటే ఒత్తిడిని జయించడమే ముఖ్యమని పేర్కొన్నాడు.

మైదానంలో ఆలోచన విధానం ఎంతో ముఖ్యమని నితీశ్ కుమార్ రెడ్డి తెలిపాడు. ఎంత టాలెంట్ ఉన్నా ఒత్తిడిని అధిగమించకపోతే ఫలితం శూన్యమని అన్నాడు. కోహ్లితో పోలిస్తే ధోనీకి టెక్నిక్ అంత లేదని, కానీ ధోనీ మైండ్ సెట్ గొప్పగా ఉంటుందని, అందుకే దిగ్గజ ప్లేయర్‌గా ఎదిగాడని నితీశ్ పేర్కొన్నాడు. తన బలమేంటో ధోనీకి తెలుసని, మ్యాచ్‌ను ఎంతో బాగా అర్థం చేసుకుంటాడని తెలిపాడు.

అయితే 'ధోనీకి టెక్నిక్ లేదు' అని నితీశ్ చెప్పిన వీడియో క్లిప్ వైరల్‌గా మారింది. దిగ్గజ క్రికెటర్‌ను తక్కువ చేస్తూ నితీశ్ వ్యాఖ్యానించడాని సరికాదని నెటిజన్లు మండిపడ్డారు. టెక్నిక్ తెలియకుండానే ధోనీ భారత్‌కు ప్రపంచకప్‌లు ఎలా అందించాడు? సీఎస్కేకు అయిదు ట్రోఫీలు ఎలా తెచ్చిపెట్టాడని నెటిజన్లు ఫైర్ అయ్యారు. కాగా, తాజాగా ధోనీపై తాను చేసిన వ్యాఖ్యలకు నితీశ్ కుమార్ రెడ్డి వివరణ ఇచ్చాడు. ధోనీ అంటే తనకి అపారమైన గౌరవం అని పేర్కొన్నాడు. విషయంతో సంబంధం లేకుండా వీడియో క్లిప్‌ను ఎడిట్ చేసి కొందరు నెగటివ్‌గా వ్యాప్తి చేస్తున్నారని, పూర్తి వీడియోను చూడాలని కోరాడు.

Story first published: Sunday, June 2, 2024, 16:58 [IST]
Other articles published on Jun 2, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+