'బంగ్లా క్రికెట్‌కు ఇదొక గొప్ప క్షణం, ఈ విజయాన్ని నా కొడుక్కి అంకితమిస్తున్నా'

హైదరాబాద్: టీమిండియాపై విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన తన హాఫ్ సెంచరీని తన కుమారుడికి అంకిమితచ్చాడు బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం జరిగిన
తొలి టీ20లో ముష్ఫికర్ రహీమ్ 60 పరుగులతో అజేయంగా నిలిచిన సంగతి తెలిసిందే.
తీవ్ర వాయు కాలుష్యం నడుమ మందకొడి పిచ్‌పై ఆదివారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో బంగ్లా 7 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. టీమిండియాతో ఇంతకముందు జరిగిన 8 టీ20ల్లోనూ ఓడిన బంగ్లాదేశ్‌కు టీ20ల్లో ఇదే తొలి విజయం కావడం విశేషం. అంతేకాదు ఇరు జట్ల మధ్య జరుగుతున్న తొలి టీ20 సిరిస్ ఇదే కావడం విశేషం.

ముష్ఫికర్ రహీమ్ మాట్లాడుతూ
ఈ నేపథ్యంలో ముష్ఫికర్ రహీమ్ మాట్లాడుతూ "నేను ఈ విజయాన్ని నా కొడుకుకు అంకితం చేయాలనుకుంటున్నాను. అతడని చాలా మిస్సవుతున్నా. చాలా ఫాస్ట్‌గా అతడు పెరుగుతున్నాడు. నా కుమారుడు నన్ను టీవీలో చూసినప్పుడు ఠక్కున గుర్తిస్తాడు. అది ఎంతో ప్రత్యేకమైనది. కాబట్టి, ఈ హాఫ్ సెంచరీని నా కొడుకుకు అంకితం చేయాలనుకుంటున్నాను" అని అన్నాడు.

పోటీ పడటానికి మేము ఇక్కడకు వచ్చాం
"ప్రతి గేమ్‌లోనూ పోటీ పడటానికి మేము ఇక్కడకు వచ్చాము. మేము నిలకడగా ఆడటంతో పాటు ప్రతి ఆటలో మెరుగవుతున్నంత కాలం... ప్రతి మ్యాచ్‌లోనూ గెలవాలని ఎదురుచూస్తున్నాం. ఈ గేమ్‌లో గెలిచాం కాబట్టి టీమిండియాతో జరగనున్న తదుపరి మ్యాచ్‌ల్లో కూడా ఖఛ్చితంగా పోటీ పడతాం" అని ముష్ఫకర్ తెలిపాడు.

బంగ్లా క్రికెట్‌కు ఇదొక గొప్ప క్షణం
"బంగ్లాదేశ్ క్రికెట్‌కు ఇదొక గొప్ప క్షణం. ఎందుకంటే టీ20 ఫార్మాట్‌లో ఇంతవరకు మేము వారిపై గెలవలేదు. మా జట్టులో కీలక ఆటగాళ్లు లేకపోయినప్పటికీ యువ ఆటగాళ్లందరూ కలిసి ఉండిన విధానం మరియు బౌలర్లందరూ బౌలింగ్ చేసిన విధానం అత్యుత్తమంగా ఉందని నేను భావిస్తున్నాను" అని ముష్ఫికర్ అన్నాడు.

అంతా కృనాల్ పాండ్యా వల్లే!
తొలి టీ20లో బంగ్లాదేశ్ విజయం సాధించడంతో మూడు టీ20ల సిరిస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 నవంబర్ 7న రాజ్ కోట్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో చాహల్ బౌలింగ్‌లో ముష్ఫికర్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ వద్ద కృనాల్ పాండ్యా వదిలేశాడు. ఆ సమయంలో బంగ్లా విజయానికి 16 బంతుల్లో 35 పరుగులు కావాలి. కృనాల్ పాండ్యా గనుక ఆ క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications