టీ20 వరల్డ్ కప్-2024లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. డల్లాస్ వేదికగా గ్రూప్-ఏలో ఉన్న అమెరికా-పాకిస్థాన్ ఇవాళ తలపడనున్నాయి. భారత కాలమాన ప్రకారం ఇవాళ రాత్రి 9 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. సూపర్-8కు అర్హత సాధించాలంటే అమెరికాకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. అయితే రన్నరప్ పాకిస్థాన్‌ను జట్టును ఓడిండం ఆతిథ్య జట్టు యూఎస్ఏకు అంత సులువు కాదు.
కానీ ఇవాళ పాకిస్థాన్‌ను ఓడిస్తామని అమెరికా కెప్టెన్ మోనాన్క్ పటేలే ధీమా వ్యక్తం చేశాడు. పాక్‌ను చిత్తు చేయడానికి అరంగట సమయం సరిపోతుందని అన్నాడు. మైదానంలో మెరుగైన ప్రదర్శన చేస్తే ప్రత్యర్థిని ఓడించడం అంత కష్టమేమి కాదని అన్నాడు. ''పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 30-40 నిమిషాలు మేం మంచి ప్రదర్శన చేస్తే చాలు. మ్యాచ్‌ను మావైపు తిప్పుకుంటాం'' అని మోనాన్క్ అన్నాడు.

టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు పాకిస్థాన్ ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఆడింది. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు టీ20ల సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు వర్షార్పణం అయ్యాయి. మిగిలిన రెండింట్లో పాక్ చిత్తుగా ఓడింది. ఇక ఐర్లాండ్ సిరీస్‌లో ఫేవరేట్‌గా బరిలోకి దిగిన పాకిస్థాన్ తొలి మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడింది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి సిరీస్‌ను గెలిచి పరువు కాపాడుకుంది. మరోవైపు అమెరికాను పసికూనగా భావించే పరిస్థితులు లేవు.
ప్రపంచకప్‌కు ముందు బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు అమెరికా కైవసం చేసుకుంది. అంతేగాక వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్‌లో కెనడాపై రికార్డు ఛేదన సాధించింది. అదే జోరుతో పాకిస్థాన్‌పై గెలవాలని యునైటెడ్ స్టేట్స్ భావిస్తోంది.
తుది జట్లు (అంచనా)
పాకిస్థాన్: బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, ఉస్మాన్ ఖాన్, షాదబ్ ఖాన్, అజామ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, అబ్రార్ అహ్మద్, షాహిన్ అఫ్రిది, హారిస్ రవూఫ్, నసీమ్ షా
అమెరికా: మోనాన్క్ పటేల్ (కెప్టెన్), స్టీవెన్ టేలర్, ఆండ్రిస్ గౌస్, ఆరోన్ జోన్స్, కోరీ అండర్సన్, హర్మీత్ సింగ్, నితీశ్ కుమార్, జస్దీప్ సింగ్, సౌరభ్, అలీఖాన్, షాడ్లీ వాన్.