Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SA20: అక్కా.. జర స్లో! సెకన్లలో బీర్‌ తాగేసిన యువతి (Video)

సౌతాఫ్రికా టీ20 లీగ్‌ హొరాహోరీగా సాగుతోంది. విధ్వంసక ఇన్నింగ్స్‌లతో బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్నారు. అయితే ఇటీవల కేప్‌టౌన్ వేదికగా ఎంఐ కేప్ టౌన్-పార్ల్ రాయల్స్ మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. స్టాండ్స్‌లో కూర్చొన్న ఓ యువతి చేసిన పని నెట్టింట్లో వైరల్‌గా మారింది. అందర్నీ షాక్‌కు గురిచేస్తూ సెకన్లలో బీర్లను రెండు సార్లు లాంగించేసింది.

అసలేం జరిగిందంటే.. పార్ల్ రాయల్స్ ఇన్నింగ్స్‌లో 14వ ఓవర్‌లో కెమెరామెన్ ఫ్యాన్స్ వైపు కెమెరా తిప్పాడు. కెమెరా తనని గమనిస్తుందనే విషయాన్ని గుర్తించిన ఓ యువతి ఆనందంతో గెంతులేసింది. అంతేగాక తన చేతిలో ఉన్న బీర్ గ్లాస్‌ను ఆపకుండా తాగేసింది. ఆ తర్వాత విజయం సాధించినట్లుగా సింబాలిక్ చూపించింది.

A funny incident in the SA20 league. A young woman who drank beer in seconds video goes viral

అయితే కెమెరామెన్ తర్వాత బంతికే మరోసారి ఆ యువతిని ఫోకస్ చేశాడు. అప్పటికే తన బీర్ అయిపోవడంతో పక్కనే కూర్చొన్న మరో ప్రేక్షకుడి చేతుల్లోని బీర్‌ను అనుమతి లేకుండా లాగేసుకుంది. నాన్‌స్టాప్‌గా క్షణాల్లో దాన్ని కూడా గుటుక్కమనిపించింది. స్టేడియంలో ఉన్న వారంతా ఆ యువతి పనిని ఎంజాయ్ చేస్తూ క్లాప్స్ కొట్టారు.

ప్రస్తుతం దీనికి సంబధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఆ యువతిపై నెటిజన్లు విభిన్నంగా కామెంట్లు చేస్తున్నారు. 'కొంచెం నెమ్మదిగా తాగండి అక్కా.. ఆరోగ్యం దెబ్బతింటుంది, డిహైడ్రేషన్ వల్ల ఇలా తాగేస్తుందనుకుంటా, బాయ్స్ కంటే చాలా బెటర్‌గా తాగేస్తుంది, భారత్‌లో ఓ మహిళా ఇలా చేయడానికి సాహసిస్తుందా? ' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా, ఈ మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్‌పై ఎంఐ కేప్ టౌన్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ ఎనిమిది వికెట్లకు 172 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (46; 31 బంతుల్లో), జేసన్ రాయ్ (38; 14 బంతుల్లో) రాణించారు. కేప్ టౌన్ బౌలర్లలో థామస్ మూడు వికెట్లు తీశాడు. అనంతరం కేప్ టౌన్ జట్టు 16.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ రికెల్టన్ (94*, 52 బంతుల్లో) విధ్వంసం సృష్టించాడు. మరో ఓపెనర్ డసెన్ కూడా (41; 28 బంతుల్లో) సత్తాచాటాడు. కాగా, ముంబయి ఇండియన్స్‌కు చెందిన ఎంఐ కేప్ టౌన్ జట్టుకు పొలార్డ్ నాయకత్వం వహిస్తున్నాడు.

Story first published: Monday, January 22, 2024, 18:06 [IST]
Other articles published on Jan 22, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+