
టీ20 వరల్డ్ కప్ ఆదివారం అట్టహసంగా ప్రారంభమైంది. ఆదివారం శ్రీలంక, నమీబియా మధ్య, యూఏఈ, నెదర్లాండ్ మధ్య మ్యాచులు జరిగాయి. నమీబియా అనూహ్యంగా శ్రీలంకపై విజయం సాధించింది. మరో మ్యాచ్ లో యూఏఈపై నెదర్లాండ్ గెలిచింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ 8 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. నెదర్లాండ్ 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని సాధించింది.
5 పరుగులే
అయితే ఈ మ్యాచ్ ఓ చిన్నహాస్యాకర ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన వారందరూ నవ్వుకుంటున్నారు. గత నెలలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన 16 ఏళ్ల అయాన్ అఫ్జల్ ఖాన్ ఈ మ్యాచ్ లో 5 పరుగులకే ఔట్ అయ్యాడు. అతను పెవిలియన్ వెళ్తుండగా రోప్ తట్టుకుని కిందపడిపోయాడు. అతన వెంటనే లేచి డ్రెస్ రూమ్ లోకి వెళ్లాడు.
బౌలింగ్
బార్మీ ఆర్మీ, ఇంగ్లీష్ క్రికెట్ అభిమానుల బృందం అయాన్ అఫ్జల్ ఖాన్ కింద పడిపోయిన క్లిప్‌ను ట్వీట్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయాన్ అఫ్జల్ ఖాన్ బ్యాట్‌తో విజయవంతం కానప్పటికీ బౌలింగ్ బాగా చేశాడు. మూడు ఓవర్ల వేసి ఒక వికెట్ తీసి 15 పరుగులు చేశాడు. ఖాన్ 16 సంవత్సరాల 335 రోజులకు T20 ప్రపంచ కప్ ఆడాడు. చరిత్రలో మహ్మద్ అమీర్ రికార్డును బద్దలు కొట్టిన అతి పిన్న వయస్కుడిగా అయాన్ అఫ్జల్ ఖాన్ రికార్డ్ సృష్టించాడు.