Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AUS vs PAK: ఛీ..ఛీ స్టేడియంలో గలీజ్ పని.. అడ్డంగా దొరికిపోయిన జంట!(వీడియో)

మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా-పాకిస్థాన్ రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసేసరికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. 241 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. 16 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆ జట్టును మిచెల్ మార్ష్ (96),
స్టీవ్ స్మిత్ (50) ఆదుకున్నారు.

వీరిద్దరు అయిదో వికెట్‌కు 153 పరుగులు జోడించారు. 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లైఫ్ లభించిన మార్ష్ తర్వాత చెలరేగాడు. బౌండరీలతో హోరెత్తించాడు. అయితే వన్డే ఫార్మాట్‌లా దూకుడుగా ఆడుతూ సెంచరీకి చేరువవుతున్న మార్ష్‌ను హంజా పెవిలియన్‌కు చేర్చాడు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, హంజా చెరో మూడు వికెట్లు తీశారు.

A couple was caught on camera having a dirty behaviour during the Australia vs Pakistan match

అయితే ఆసీస్-పాక్ మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చిన ఓ జంట పాడుపని చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. కుర్చీల్లో కూర్చొని శృంగారం చేస్తూ కెమెరా కంటికి చిక్కింది. స్టేడియంలోని స్క్రీన్‌పై వారి నిర్వాకం కనిపించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీన్ని గమనించిన ఆ జంట వెంటనే ఉలిక్కిపడి లేచి వెళ్లిపోయింది.

అయితే కెమెరామెన్ మరోసారి వారిద్దరిపైనే ఫోకస్ చేయడానికి ప్రయత్నించాడు. దీంతో గలీజ్ పనిలో భాగమైన అతడు ముఖాన్ని చొక్కాతో కవర్ చేసుకుంటూ అందరికీ హాయి చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. స్టేడియంలో ఇలాంటి పని చేయడమేంటని నెటిజన్లు మండిపడుతున్నారు. గెలుపు కోసం పాక్ పోరాటం.. స్టేడియంలో ఈ జంట ఆరాటం.. రెండూ చెత్తవని కామెంట్లు చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో మరికొన్ని అనూహ్య సంఘటనలు జరిగాయి. వర్షం కారణంగా మ్యాచ్‌ను నిలిపివేయడం ఎక్కడైనా సాధారణమే. కానీ ఈ బాక్సింగ్ డే టెస్టులో పావురాలు, అంపైర్ కోసం మ్యాచ్‌ను నిలిపివేసిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. రెండో రోజు ఆటలో పావురాలు బయటకు పంపించడానికి ఆటను కాసేపు నిలిపివేశారు. అలాగే మూడో రోజు ఆటలో థర్డ్ అంపైర్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోవడంతో కొన్ని నిమిషాల పాటు మ్యాచ్ ఆగింది.

Story first published: Thursday, December 28, 2023, 15:26 [IST]
Other articles published on Dec 28, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+