హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 10వ ఎడిషన్ పూర్తి షెడ్యూల్‌ని బీసీసీఐ బుధవారం విడుదల చేసింది. ఏప్రిల్ 5 నుంచి మే 21 వరకు ఐపీఎల్ సందడి చేయనుంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్, రన్నర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.
ఈ మ్యాచ్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఏప్రిల్ 5న జరగనుంది. ఇదే స్టేడియంలో మే 21న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దేశవ్యాప్తంగా 10 వేదికల్లో 47 రోజులపాటు మొత్తం 60 మ్యాచ్‌లను నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. ప్రతి జట్టు 14 మ్యాచ్‌లను ఇతర జట్లతో ఆడాల్సి ఉంటుంది.
అందులో 7 మ్యాచ్‌లు సొంత మైదానం ఆతిథ్యమిస్తుంది. క్వాలిఫయర్స్, ఎలిమినేటర్స్ వేదికలను ఇంకా నిర్ణయించలేదు. మరోవైపు కింగ్స్ లెవన్ పంజాబ్ తమ రెండో హోమ్ గ్రౌండ్‌గా ఇండోర్‌ను ఎంపిక చేసుకుంది. దీంతో 2011 తర్వాత ఇండోర్‌లో మరోసారి ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనుండటం విశేషం.
ధర్మశాల, రాయ్‌పూర్‌లకు మ్యాచ్‌లను షెడ్యూల్ చేయలేదు. 2017 ఐపీఎల్ కోసం ఫిబ్రవరి 20వ తేదీన బెంగళూరులో ఆటగాళ్ల వేలం జరగనుంది. రూ.2 కోట్ల నుంచి రూ. 10 లక్షల మధ్య కనీస విలువతో వేలం కోసం మొత్తం 351 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు.

* 351 - మొత్తం ఆటగాళ్లు
* రూ. 2 కోట్లు - ఈ ఏడాది వేలంలో అత్యధిక బేస్ ప్రైస్ ధర
* 7- వేలంలో అత్యధిక బేస్ ప్రైస్ ధర కలిగిన ఆటగాళ్లు (ఇషాంత్ శర్మ, బెన్ స్టోక్స్, క్రిస్ మోర్గాన్, క్రిస్ వోక్స్, మిచెల్ జాన్సన్, కుమ్మిన్స్, ఏంజెలో మ్యాథ్యూస్)
* 6 - వేలంలో అసోసియేషన్ దేశానికి చెందిన సభ్యుల సంఖ్య. ఆప్ఘనిస్థాన్ నుంచి 5, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి 1.
* రూ. 384.67 కోట్లు - వేలంలో మొత్తం 8 ప్రాంచైజీల వెచ్చించనున్న సొమ్ము.
* రూ. 143.33 కోట్లు - 8 ప్రాంచైజీల వద్ద ఉన్న మొత్తం సొమ్ము.
* రూ. 23.35 కోట్లు - అత్యధికంగా ఓ ఫ్రాంచైజీ వద్ద ఉన్న సొమ్ము - కింగ్స్ ఎలెవన్ పంజాబ్
* 89 - వివిధ ప్రాంఛైజీలు విడుదల చేసిన ఆటగాళ్ల సంఖ్య
* 76 - ఈ ఏడాది వేలంలో ఫ్రాంఛైజీలు కొనుగోలు చేసే ఆటగాళ్ల సంఖ్య
* 44- 8 ప్రాంఛైజీల వద్ద ఉన్న విదేశీ ఆటగాళ్ల సంఖ్య
* 28 - ఈ ఏడాది వేలంలో జట్లు కొనుగోలు చేసే విదేశీ ఆటగాళ్ల సంఖ్య
* 27 - ఐపీఎల్ 2017 టోర్నీలో ఓ జట్టు అత్యధికంగా కలిగి ఉంటే ఆటగాళ్ల సంఖ్య
* 9 - ఒక జట్టు విదేశీ ఆటగాళ్లను కలిగి ఉంటే సంఖ్య
* 20 - వేలంలో ఎక్కువ మంది ఆటగాళ్లను ఉంచుకున్న జట్లలోని ఆటగాళ్ల సంఖ్య.
ఎవరి వద్ద ఎంతంత సొమ్ము మిగిలుందంటే:
* కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (KXIP) - Rs 23.35 crore (Purse spent - Rs 42.65 crore)
* ఢిల్లీ డేర్ డెవిల్స్ (DD) - Rs 23.1 crore (Rs 42.9 crore)
* సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) - Rs 20.9 crore (Rs 45.1 crore)
* కోల్ కతా నైట్ రైడర్స్ (KKR) - Rs 19.75 crore (Rs 46.25 crore)
* రైజింగ్ పూణె గెయింట్స్ (RPS) - Rs 17.5 crore (Rs 48.5 crore)
* గుజరాత్ లయన్స్ (GL) - Rs 14.35 crore (Rs 51.65 crore)
* రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (RCB) - Rs 12.825 crore (Rs 53.175 crore)
* ముంబై ఇండియన్స్ (MI) - Rs 11.555 crore (Rs 54.445)
ప్రస్తుతం ఆయా జట్ల వద్ద ఉన్న ఆటగాళ్ల సంఖ్య (మొత్తం ఆటగాళ్ల సంఖ్య: 27, విదేశీ క్రికెటర్లు: 9)
* ఢిల్లీ డేర్ డెవిల్స్ - 17 (5 overseas)
* కింగ్స్ ఎలెవన్ పంజాబ్ - 19 (5)
* కోల్ కతా నైట్ రైడర్స్ - 14 (4)
* ముంబై ఇండియన్స్ - 20 (6)
* రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు - 20 (8)
* సన్ రైజర్స్ హైదరాబాద్ - 17 (5)
* రైజింగ్ పూణె గెయింట్స్ - 17 (5)
* గుజరాత్ లయన్స్ - 16 (6)