పంత్‌కు చోటు దక్కలేదు: ఆశ్చర్యానికి గురి చేసిందన్న గవాస్కర్

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు చోటు దక్కకపోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పుకొచ్చాడు టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్. వరల్డ్‌కప్ కోసం భారత జట్టుని సోమవారం సెలక్టర్లు ప్రకటించారు. మొత్తం 15 మందితో కూడిన భారత జట్టుని టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ పేరును ప్రకటించిన సెలక్టర్లు... అంబటి రాయుడు, రిషబ్ పంత్‌లకు సెలక్టర్లు మొండిచేయి చూపించారు. ధోనికి బ్యాకప్ వికెట్ కీపర్‌గా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను పక్కన పెట్టి అనుభవం ఉన్న దినేశ్ కార్తీక్‌వైపే సెలక్టర్లు మొగ్గు చూపారు.

సునీల్ గవాస్కర్ ఇలా
దీంతో సెలక్టర్లు తీసుకున్న నిర్ణయంపై సునీల్ గవాస్కర్ స్పందించాడు. సోమవారం ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్యూలో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ "పంత్ ఫామ్‌ని చూస్తే ఆశ్చర్యాన్ని కలిగించింది. ఐపీఎల్, అంతకు ముందు మ్యాచుల్లోనూ పంత్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. వికెట్ కీపింగ్‌లో కూడా మంచి పరిణితి సాధించాడు" అని అన్నాడు.

జట్టుకు ఎంతగానో
"'టాపార్డర్‌లో ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ ఆడటం జట్టుకు ఎంతగానో ఉపయోగపడేది. ఎందుకంటే, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ ఉంటే బౌలర్లు తమ లైన్‌ని మార్చుకోవాలి, కెప్టెన్ సైతం ఫీల్డింగ్‌ను పూర్తిగా మార్చాల్సి ఉంటుంది. రిషబ్ పంత్ ఐపీఎల్‌లోనూ మంచి ప్రదర్శన చేశాడు. ఇప్పటికే 245 పరుగులు చేశాడు. కార్తీక్ కేవలం 111 పరుగులే చేశాడు" అని గవాస్కర్ అన్నాడు.

మంచి వికెట్ కీపర్ కావాలి
"వరల్డ్‌కప్ ఆడే సమయంలో ధోనికి జలుబు చేసి, ఆడలేని పరిస్థితిలో ఉంటే అతడి స్థానంలో ఓ మంచి వికెట్ కీపర్ కావాలి. కార్తీక్ ఒక మంచి వికెట్ కీపర్. అందుకే అతడికి జట్టులో చోటు దక్కింది అని అనుకుంటున్నా" అని గవాస్కర్ అన్నాడు. సన్నీతో పాటు టీమిండియా మాజీ ఆటగాళ్లు ఆకాశ్ చోప్రా, సంజయ్ మంజ్రేకర్ కూడా పంత్‌కు జట్టులో దక్కకపోవడంపై నిరాశచెందారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications