'సిరీస్ గెలవకుంటే భారత్ మళ్లీ వెనక్కే'

హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌తో టీమిండియా 2-0 ఆధిక్యం సాధించిన సంగతి తెలిసిందే. ఆదివారం సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత్ జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది.
ఫలితంగా వన్డేల్లో నంబర్ వన్ స్థానాన్ని భారత్ సొంతం చేసుకుంది. తాజా గెలుపుతో 121 రేటింగ్ పాయింట్లతో టీమిండియా ప్రథమ స్థానంలో నిలవగా, దక్షిణాఫ్రికా 115 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. ఈ ర్యాంకు తాత్కాలికమే.
అయితే నంబర్ వన్ ర్యాంకును కాపాడుకోవాలంటే సఫారీలతో సిరీస్‌ను కచ్చితంగా గెలవాల్సి ఉంది. వన్డే సిరీస్‌ను భారత్ జట్టు 4-2తో ముగించిన పక్షంలో టాప్ ర్యాంక్ పదిలంగా ఉంటుంది. అలా కాకుండా 3-3గా గెలిచినా ర్యాంకు అనుమానమే.
ఒకవేళ అలా కాకుండా సఫారీలు సిరీస్ సాధిస్తే మాత్రం భారత జట్టు తిరిగి రెండో ర్యాంక్‌కు పరిమితం కావాల్సిందే. ప్రస్తుతం భారత జట్టు టెస్టుల్లో కూడా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతుండగా, సఫారీ జట్టు రెండో స్థానంలో ఉంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications