99 not out: కపిల్ దేవ్, మెక్‌గ్రాత్‌ల ఎలైట్ జాబితాలో ప్యాట్ కమిన్స్

హైదరాబాద్: ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు నెలొకొల్పాడు. 2019లో టెస్టుల్లో 59, వన్డేల్లో 31, టీ20ల్లో తొమ్మిది వికెట్లు పడగొట్టడం ద్వారా మొత్తంగా ఈ ఏడాది 99 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.
ఈ జాబితాలో ఆ తర్వాతి స్థానంలో మరో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ (77), టీమిండియా పేసర్ మహ్మద్ షమీ(77)లు ఉన్నారు. టెస్టుల్లో 20.50 యావరేజితో 59 వికెట్లు తీసిన కమిన్స్, 21.61 యావరేజితో 31 వికెట్లు పడగొట్టాడు. ఇక, టీ20ల విషయానికి వస్తే 19.11 యావరేజితో 9 వికెట్లు తీశాడు.
1979లో కపిల్‌దేవ్ (భారత్), 1989లో అల్డెర్‌మ్యాన్ (ఆస్ట్రేలియా), 1999లో గ్లెన్ మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా), 2009లో మిచెల్ జాన్సన్ (ఆస్ట్రేలియా) అగ్రస్థానంలో నిలిచారు. ఈ ఏడాది కూడా పేసర్ కమిన్స్ అగ్రస్థానంలో నిలిచాడు. ఇటీవల కోల్‌కతా వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో కమిన్స్‌ను కేకేఆర్ రూ. 15.5 కోట్లకు కొనుగోలు చేసింది.
ఈ ఏడాది ప్యాట్ కమిన్స్ ప్రదర్శన:
In Tests, he has 59 wickets at an average of 20.13
In ODIs, he has 31 victims at an average of 21.61
In T20Is, he has 9 wickets at an average of 19.11
పెర్త్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి కివీస్ పతనాన్ని కమిన్స్ శాసించిన సంగతి తెలిసిందే. 487 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 240 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా మూడు టెస్టుల సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సొంతం చేసుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications