న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌ వేలానికి 971 మంది క్రికెటర్లు.. స్టార్క్‌ దూరం!!

IPL 2020 Auction : Mitchell Starc, Joe Root Out Of Auction || Oneindia Telugu
971 players to go under the hammer at IPL 2020 auction on December 19

ఢిల్లీ: ఐపీఎల్‌-2020 కోసం జరిగే వేలంలో మొత్తం 971 మంది క్రికెటర్లు పాల్గొననున్నారు. తుది గడువు నవంబర్‌ 30లోగా వీరంతా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 971 మంది క్రికెటర్లలో 713 మంది భారత ఆటగాళ్లు కాగా.. 258 మంది విదేశీ ఆటగాళ్లు. వీరంతా 73 స్థానాల కోసం వేలంలో పోటీపడతారు. ఈ నెల 19న కోల్‌కతాలో ఐపీఎల్‌ వేలం జరగనుంది.

<strong>సినీనటి ఆశ్రిత శెట్టితో వివాహం.. ఓ ఇంటివాడైన మనీష్‌ పాండే!!</strong>సినీనటి ఆశ్రిత శెట్టితో వివాహం.. ఓ ఇంటివాడైన మనీష్‌ పాండే!!

వేలంలో 971 మంది క్రికెటర్లు:

వేలంలో 971 మంది క్రికెటర్లు:

వేలంలో పాల్గొనే వారిలో 215 మందికి అంతర్జాతీయ అనుభవం ఉండగా.. 754 మంది అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్స్‌, ఇద్దరు అసోసియేట్‌ దేశాలకు చెందిన వారు ఉన్నారు. ఇక 713 మంది భారత క్రికెటర్లలో 19 మంది జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించగా.. 634 మంది ఇప్పటివరకు టీమిండియా తరఫున ఆడలేదు. మరో 60 మంది కనీసం ఒక ఐపీఎల్‌ మ్యాచ్‌ అయినా ఆడినవారున్నారు.

డిసెంబర్‌ 19న వేలం:

డిసెంబర్‌ 19న వేలం:

ఈ 971 మంది నుంచి తాము కోరుకుంటున్న ఆటగాళ్ల పేర్లను ఎనిమిది ఫ్రాంచైజీలు డిసెంబర్‌ 9లోగా షార్ట్ లిస్టును సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం తుది వేలం జరగుతుంది. ఐపీఎల్‌లో ప్రస్తుతం గరిష్టంగా 73 మందిని మాత్రమే ఎంచుకునే అవకాశం ఉంది. డిసెంబర్‌ 19న వేలం నిర్వహిస్తారు.

స్టార్క్‌ దూరం:

స్టార్క్‌ దూరం:

ఆస్ట్రేలియా స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ వరుసగా రెండో ఏడాది ఐపీఎల్‌కు దూరమవుతున్నాడు. తొలిసారిగా 2015లో బెంగళూరుకు ఆడిన స్టార్క్‌.. 2018లో కోల్‌కతాకు ప్రాతినిథ్యం వహించాడు. 2019 ఐపీఎల్‌లో ఆడలేదు. ఈ వేలానికి ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్‌ కూడా దూరమయినట్టు తెలుస్తోంది.

రూ. 2 కోట్ల కనీస ధర:

రూ. 2 కోట్ల కనీస ధర:

7 మంది విదేశీ క్రికెటర్లు రూ. 2 కోట్ల కనీస ధరతో వేలానికి సిద్ధమయ్యారు. ఈ జాబితాలో కమిన్స్, హాజల్‌వుడ్, లిన్, మిషెల్‌ మార్ష్, మ్యాక్స్‌వెల్, స్టెయిన్, మాథ్యూస్‌ ఉన్నారు. భారత్‌ తరఫున ఆడిన 19 మందిలో ఒక్కరు కూడా ఈ కనీస విలువలో తమ పేరు చేర్చకపోవడం విశేషం.

Story first published: Tuesday, December 3, 2019, 8:12 [IST]
Other articles published on Dec 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X