For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పదిలో 9 ఫైనల్స్: టీ20 గెలవాంటే జట్టులో రోహిత్ శర్మ ఉండాల్సిందే!

IPL 2019 : Rohit Sharma Registers Incredible Record With MI's Fourth IPL Title Win | Oneindia Telugu
9 out of 10 in T20 final! Rohit Sharma registers incredible record with MIs fourth IPL title win

హైదరాబాద్: టీ20 టోర్నీలో విజయం సాధించాలా? అయితే మీ జట్టులో రోహిత్ శర్మను చేర్చుకోండి. నాలుగు ట్రోఫీలతో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో విజయవంతమైన కెప్టెన్‌గా కొనసాగుతున్న రోహిత్ శర్మ ఖాతాలో మరో అరుదైన రికార్డు వచ్చి చేరింది. ఐపీఎల్‌లో అత్యధిక ఫైనల్స్ ఆడిన ఆటగాళ్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి రోహిత్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఉప్పల్ వేదికగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఒక పరుగు తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మకు ఇది 10వ ఐపీఎల్ పైనల్ మ్యాచ్ కావడం విశేషం. అత్యధిక ఐపీఎల్ ఫైనల్స్ ఆడిన ఆటగాళ్ల జాబితాలో ధోని(14), సురేశ్ రైనా(14) అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

అశ్విన్‌తో కలిసి రెండో స్థానంలో

అశ్విన్‌తో కలిసి రెండో స్థానంలో

ఆ తర్వాతి 10 ఐపీఎల్ పైనల్స్ మ్యాచ్‌లాడి ఈ జాబితాలో రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. 2007లో వరల్డ్ టీ20 క్యాంపెయిన్‌తో కలిపి రోహిత్ శర్మ ఆడిన 10 టీ20 ఫైనల్స్‌లో 9 మ్యాచ్‌ల్లో తాను ప్రాతినిథ్యం వహించిన జట్టు విజయం సాధించింది. రోహిత్ శర్మ తన మొదటి ఐపీఎల్ టైటిల్‌ని 2009లో నెగ్గాడు.

2013లో కెప్టెన్‌గా తొలిసారి

2013లో కెప్టెన్‌గా తొలిసారి

అప్పట్లో డెక్కన్ ఛార్జర్స్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ ఆ జట్టు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత 2013లో రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ మొట్టమొదటిసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా అవతరించింది. రోహిత్ శర్మ ఐదు ఐపీఎల్ టైటిళ్లను నెగ్గిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు.

కెప్టెన్‌గా నాలుగు ఐపీఎల్ టైటిళ్లు

కెప్టెన్‌గా నాలుగు ఐపీఎల్ టైటిళ్లు

ఇక, కెప్టెన్‌గా నాలుగు ఐపీఎల్ టైటిళ్లను నెగ్గాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో పాటు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరుతో టీమిండియా తరుపున కెప్టెన్‌గా రోహిత్ శర్మ మూడు టైటిళ్లను నెగ్గాడు. 2014 వరల్డ్ టీ20 ఫైనల్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

రోహిత్ శర్మ నెగ్గిన టీ20 టోర్నీ ఫైనల్స్:

రోహిత్ శర్మ నెగ్గిన టీ20 టోర్నీ ఫైనల్స్:

* WT20 2007 - India won by 5 runs vs Pakistan

* IPL 2009 - With Deccan Chargers as vice-captain

* IPL 2013 - With Mumbai Indians as captain

* CLT20 2013 - With Mumbai Indians as captain

* WT20 2014 - Sri Lanka won by six wickets

* IPL 2015 - With Mumbai Indians as captain

* Asia Cup 2016 - India won by eight wickets vs Bangladesh

* IPL 2017 - With Mumbai Indians as captain

* Nidahas Trophy 2018 - India won by four wickets vs Bangladesh

* IPL 2019 - With Mumbai Indians as captain

Story first published: Monday, May 13, 2019, 19:13 [IST]
Other articles published on May 13, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+