Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ కప్ క్రికెట్లో జరిగిన ఆసక్తికర విషయాలు.... తెలుసుకోండి

న్యూఢిల్లీ: 11వ ఐసీసీ వరల్డ్ కప్ 2015 ఫిబ్రవరి 14న ప్రారంభం కానుంది. అదే రోజున వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇస్తున్న జట్లలో ఒకటైన న్యూజిలాండ్... శ్రీలంకతో తలపడనుంది. ఎప్పుడెప్పుడూ అని యావత్ క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో 14 జట్లు పాల్గొంటున్నాయి.

ప్రారంభరోజున ఆస్టేలియా జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది. ఇక దాయాది దేశాలైన పాకిస్ధాన్, భారత్ ఫిబ్రవరి 15న అడిలైడ్ గ్రౌండ్‌లో తలపడనున్నాయి. మార్చి 29న వరల్డ్ కప్ ఫైనల్ మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది.

49 రోజుల పాటు జరగనున్న ఈ వరల్డ్ కప్ టోర్నమెంట్‌‌ను అత్యంత వైభంగా నిర్వహించాలని ఆతిథ్య దేశాలు ఆస్టేలియా, న్యూజిలాండ్‌లు సన్నాహాకం చేశాయి. గతంలో జరిగిన వరల్డ్ కప్‌లో జరిగిన కొన్ని విశేషాలను పాఠకులకు ప్రత్యేకంగా అందిస్తున్నాం.

9 interesting facts about World Cup cricket

వరల్డ్ కప్‌లో జరిగిన ఆసక్తికర విషయాలు:

* వెస్టిండిస్ జట్టు మూడు సార్లు వరల్డ్ కప్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. అందులో రెండు సార్లు 1975, 1979లో విజయం సాధించింది. మూడోసారి భారత్ చేతిలో పరాజయాన్ని చవిచూసింది. ఆ తర్వాత వెస్టిండిస్ ఎప్పుడూ ఫైనల్‌కు చేరుకోకపోవడం విశేషం.

* గత మూడు దశాభ్దాలుగా ఇంగ్లాండ్ జట్టు మూడు సార్లు వరల్డ్ కప్‌ను ఓడిన జట్టుగా పేరుగాంచింది. 1975, 1987, 1992లో మూడు సార్లు ఫైనల్‌కు చేరినప్పుడు జట్టులో గ్రాహమ్ గూచ్ ఉన్నారు.

* ఆసియా ఖండంలో రెండు సార్లు వరల్డ్ కప్‌ను కైవసం చేసుకున్న జట్టుగా టీమిండియా (1983, 2011) నిలిచింది. పాకిస్ధాన్ (1992), శ్రీలంక (1996)లో కప్‌ను సాధించాయి.

* వరల్డ్ కప్ ఫైనల్స్‌కు ఎక్కువ సార్లు ఆతిథ్యం ఇచ్చిన గ్రౌండ్‌గా లార్డ్స్‌కు పేరుంది. ఇప్పటి వరకు నాలుగు సార్లు లార్డ్స్ మైదానం వరల్డ్ కప్ ఫైనల్స్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఆ తర్వాత మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (2) సార్లు ఆతిథ్యం ఇచ్చి రెండో స్ధానంలో ఉంది.

* భారత్‌కు చెందిన బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు(2,278) సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఎక్కువ సెంచరీలు(6) చేసిన ఆటగాడు కూడా సచిన్ కావడం విశేషం.

* వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్లు తీసుకున్న ఆటగాడి రికార్డు ఆస్టేలియన్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ పేరిట ఉంది. మొత్తం 39 మ్యాచ్‌ల్లో 71 వికెట్లు తీసుకున్నాడు. 2003లో నమీబియాపై ఆడిన మ్యాచ్‌లో మెక్‌గ్రాత్ బౌలింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన(7-15)ను కనబర్చాడు.

* వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా దక్షిణాఫ్రికాకు చెందిన గ్యారీ కిస్టెన్ పేరిట ఉంది. 1996లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 188 పరుగులు సాధించాడు.

* ఆస్టేలియా జట్డు మూడు సార్లు వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుని 12 ఏళ్ల రికార్డుని నెలకొల్పింది. 1999 వరల్డ్ కప్‌లో పాకిస్ధాన్‌పై విజయం సాధించిన అస్టేలియా వరుసగా 2003, 2007లో విజయం సాధించింది. 2011లో భారత్ వరల్డ్ కప్‌ను సొంతం చేసుకుంది.

* 1996 వరల్డ్ కప్‌లో శ్రీలంక జట్టుకి ఒక్క మ్యాచ్‌కే 6 పాయింట్లు దక్కాయి. 1996 వరల్డ్ కప్‌ను శ్రీలంక కైవసం చేసుకుంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+