Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

9 Ducks, 9 All Out: మిజోరాం జట్టు అత్యంత చెత్త ప్రదర్శన ఇది!

9 Ducks, 9 All Out: Mizoram Womens Miserable Loss to Madhya Pradesh

హైదరాబాద్: ఈశాన్య రాష్ట్రాల్లో క్రికెట్‌ అభివృద్ధి బీసీసీఐ పడుతోన్న తాపత్రయం అంతా ఇంతా కాదు. అయితే, ఆయా జట్ల ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. పురుషుల క్రికెట్‌‌లో గత కొంతకాలంగా ఫలితాలు మెరుగ్గా ఉన్నప్పటికీ, దేశవాళీ మహిళల క్రికెట్‌లో ఒకదానికి మించి మరోటి చెత్త ప్రదర్శనలు నమోదవుతున్నాయి.

గతంలో కేరళతో జరిగిన మ్యాచ్‌లో నాగాలాండ్‌ కేవలం 2 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నాగాలాండ్, మణిపూర్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 136 వైడ్లు నమోదు అయ్యాయి. తాజాగా బీసీసీఐ సీనియర్‌ మహిళల టి20 టోర్నీలోనూ ఇలాంటి ప్రదర్శనే పునరావృతం అయింది.

గురువారం మధ్యప్రదేశ్‌తో జరిగిన గ్రూప్‌-ఈ మ్యాచ్‌లో మిజోరాం 13.5 ఓవర్లలో కేవలం 9 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో ఏకంగా 9 మంది బ్యాట్స్‌మెన్‌ డకౌట్‌ అయ్యారు. అపూర్వ భరద్వాజ్‌ (25 బంతుల్లో 6) ఒక్కడే పరుగులు చేయగా, మిగతా మూడు పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి.

ఆ తర్వాత మిజోరాం బౌలర్లు 5 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో ఇవ్వడంతో మధ్యప్రదేశ్‌ ఒక ఓవర్‌ మాత్రమే ఆడి 10 పరుగులు చేసి విజయం సాధించింది.

Story first published: Friday, February 22, 2019, 9:54 [IST]
Other articles published on Feb 22, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+