బెంగుళూరు: ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడనున్న 8 దేశాలను ఐసీసీ బుధవారం ప్రకటించింది. ఈ జాబితాలో టెస్టు క్రికెట్ ఆడుతున్న దేశాలైన వెస్టిండిస్, జింబాబ్వేకు చోటు దక్కలేదు. కాగా 2006 తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో తిరిగి బంగ్లాదేశ్‌కు చోటు లభించింది. 2017లో జరగనున్న ఈ ఛాంపియన్స్ టోర్నమెంట్‌ను ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు జూన్ 1 నుంచి 18 వరకు నిర్వహించనుంది.
సెప్టెంబర్ 30వ తేదీ నాటికి ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా ఐసీసీ ఈ జాబితాను ప్రకటించింది. భారత్‌లో జరిగిన ఛాంపియన్స్ టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్ చివరిసారిగా పాల్గొంది. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2015లో బంగ్లాదేశ్ జట్టు అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చింది. అంతేకాదు పాకిస్థాన్, భారత్, దక్షిణాఫ్రికాలపై వన్డే సిరిస్‌లను సైతం గెలుచుకుంది.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2017 15 మ్యాచ్‌ల టోర్నమెంట్. 8 జట్లు కూడా రెండు గ్రూపులుగా విడిపోయి ఆడతాయి. రెండు గ్రూపుల్లో అత్యుత్తమ కనబర్చిన టాప్ రెండు జట్లు కూడా సెమీ ఫైనల్స్‌కు చేరతాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్ త్వరలోనే వెల్లడిస్తామని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఐసీసీ ఛాంపియన్స్ టోర్నమెంట్‌కు అర్హత సాధించిన 8 జట్లు (ర్యాంకు, జట్టు, పాయింట్లు)
1 Australia 127
2 India 115
3 South Africa 110
4 New Zealand 109
5 Sri Lanka 103
6 England 100
7 Bangladesh 96
8 Pakistan 90