ప్రపంచకప్ జట్టులో 8 మంది కొత్తవారికి చోటు

మే 30 నుండి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ కోసం బీసీసీఐ సెలక్టర్లు సోమవారం భారత జట్టుని ప్రకటించారు. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టుని టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రకటించింది. భారత జట్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మలు ఎంపికయ్యారు.

జట్టు సమతూకం కోసమే:
అందరూ ఊహించినట్టు ప్రపంచకప్ జట్టులో 11 మంది ఎంపిక లాంఛనమే. మరో నాలుగు స్థానాల విషయంలో మాత్రం సెలక్షన్ కమిటీ కఠినంగా వ్యవహరించింది. ముఖ్యంగా నం. 4, వికెట్ కీపర్ స్థానాల్లో ఆచితూచి వ్యవహరించింది. జట్టు సమతూకంగా ఉండడం కోసమే కఠిన నిర్ణయాలు తీసుకున్నాం అని మ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేసాడు. ఏదేమైనా.. ప్రపంచకప్ జట్టులో చోటు ఆశించిన అంబటి రాయుడు, రిషభ్ పంత్, అంజిక్య రహానేలకు నిరాశ ఎదురైతే.. దినేశ్ కార్తీక్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, విజయ్ శంకర్‌లకు కలిసొచ్చింది.

8 మంది కొత్తవారికి చోటు:
ప్రపంచకప్ 2015లో ఆడిన 7 మంది ఆటగాళ్లు ప్రపంచకప్ 2019లో చోటు దక్కించుకున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీలు గత ప్రపంచకప్‌లో ఆడారు. ఇక విజయ్ శంకర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, కేదార్ జాదవ్, కుల్దీప్ యాదవ్, దినేశ్ కార్తీక్, యజువేంద్ర చహల్, జస్ప్రీత్ బుమ్రాలు ప్రపంచకప్ 2019లో చోటు దక్కించుకున్నారు. వీరంతా ప్రపంచకప్‌లో తొలిసారి అవకాశం దక్కించుకున్నారు. వీరందరూ గత కొద్దికాలంగా టీమిండియా తరపున ఆడుతూ సత్తా చాటడంతో.. సెలెక్టర్లు ఏకంగా 8 మందిని ఎంపిక చేశారు.

2019 ప్రపంచకప్ జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, మహేంద్ర సింగ్ ధోనీ (వికెట్ కీపర్), కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, యజువేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ.

2015 ప్రపంచకప్ జట్టు:
రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, అంబటి రాయుడు, అంజిక్య రహానే, ఎంఎస్ ధోనీ, భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, స్టువర్ట్ బిన్నీ, అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ/మోహిత్ శర్మ, ఉమేశ్ యాదవ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications