ధోనికి వీరాభిమానిని: టీ20ల్లో ఎనిమిది వేల పరుగులు సాధించడంపై రైనా


హైదరాబాద్: తన క్రికెట్ కెరీర్‌లో ఎక్కువ సమయం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీతోనే గడిపానని వెటరన్క్రికెటర్ సురేశ్ రైనా తెలిపారు. సురేశ్ రైనా టీ20 ఫార్మాట్‌లో ఎనిమిది వేల పరుగుల్ని పూర్తి చేసుకున్న తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర‍్నమెంట్‌లో భాగంగా సురేశ్ రైనా సోమవారం పాండిచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన ఘనత సాధించిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో 32 ఏళ్ల సురేశ్ రైనా 18 బంతుల్లో 12 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. దీంతో టీ20ల్లో ఎనిమిది వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ప్రస్తుతం సురేశ్ రైనా 300 మ్యాచుల్లో 8001 పరుగులు చేశాడు. మొత్తంగా టీ20ల్లో ఎనిమిది వేల పరుగుల్ని సాధించిన ఆరో క్రికెటర్‌గా రైనా నిలిచాడు.

సురేశ్ రైనా మాట్లాడుతూ
అనంతరం సురేశ్ రైనా మాట్లాడుతూ "భారత జట్టులో చాలా మందితో సన్నిహితంగా ఉంటా. అయితే కెరీర్‌లో ఎక్కువ సమయం ధోనితోనే గడపడంతో ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉంటా. అందుకే ధోని నాకు ప్రత్యేకం, అంతేకాదు ధోనికి వీరాభిమాని. ధోనీ ఏ బాధ్యతనైనా సమర్థంగా నిర్వర్తించగలడు, అతడి ప్రత్యేకత అదే" అని రైనా తెలిపాడు.

ప్రతి ఒక్క ఆటగాడికి అండగా నిలుస్తాడు
"ధోని ప్రతి ఒక్క ఆటగాడికి అండగా నిలుస్తాడు. నెట్స్‌లో నేర్చుకున్నది మైదానంలో ఆచరణలో పెడతాడు. అందుకే ఎక్కువ పరుగులు చేస్తూ జట్టుకు విజయాల్ని అందిస్తాడు. తీవ్ర ఒత్తిడిలో కూడా ధోని తడబడడు. ప్రశాంతంగా బ్యాటింగ్ చేసి పని పూర్తి చేస్తాడు. జట్టు కష్టాల్లో ఉన్నపుడు వ్యూహాలు రచించడంలో దిట్ట. అందుకే ధోని విజయవంతమైన కెప్టెన్‌గా ఎదిగాడు" అని రైనా తెలిపాడు.

ఆసీస్‌పై టెస్టు సిరీస్ గెలవడం చరిత్రాత్మకం
"ఆస్ట్రేలియాలో టీమిండియా టెస్టు సిరీస్ గెలవడం చరిత్రాత్మకం. సిరీస్ గెలుపునకు ప్రస్తుత టీమిండియాకు అర్హత ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లలో జట్టు సమతూకంగా ఉంది. ప్రపంచ కప్‌లో టీమిండియానే ఫేవరెట్" అని సురేశ్ రైనా అన్నాడు. కాగా, టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్ గేల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. క్రిస్ గేల్ 269 మ్యాచుల్లోనే 12298 పరుగులు చేశాడు.

ధోని తర్వాత సురేశ్ రైనానే
ఆ తర్వాతి స్థానాల్లో బ్రెండన్ మెకల్లమ్ (9922 పరుగులు), కీరన్ పొలార్డ్ (8838), షోయబ్ మాలిక్ (8603), డేవిడ్ వార్నర్ (8111)లు ఉన్నారు. ఇక, బారత తరుపున ఈ జాబితాలో రైనా తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ 251 మ్యాచుల్లో 7833 పరుగులు చేశాడు. దీంతో పాటు ధోనీ (301) తర్వాత మూడొందల టీ20 మ్యాచ్‌లు ఆడిన రెండో భారత క్రికెటర్‌గా రైనా అరుదైన గుర్తింపు పొందాడు. మూడోస్థానంలో రోహిత్ శర్మ (299) ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications