Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: ఇలాంటి గెలుపు నా భూతో నా భవిష్యత్తు.. ఇండియాకు ఈ విజయం ఎందుకంత స్పెషల్..?

7th Time India Winning By 10 Wickets Margin In ODI History, Why This time More special?

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో జరిగిన తొలి వన్డేలో ఇంగ్లాండ్‌ను టీమిండియా 10వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ విన్నర్ బుమ్రా బౌలింగ్ ధాటికి ఇంగ్లాండ్ తొలుత 110పరుగులకే ఆలౌటైంది. తర్వాత ఇండియా 18.4ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 114పరుగులు చేసి అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. ఛేజింగ్లో ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (76పరుగులు 58బంతుల్లో 6ఫోర్లు, 5సిక్సర్లు నాటౌట్), శిఖర్ ధావన్ (31పరుగులు 54బంతుల్లో 4ఫోర్లు నాటౌట్) కడవరకు క్రీజులో ఉండి విజయలాంఛనాన్ని తమదైన స్టైల్లో ముగించారు.

దీంతో సిరీస్లో ఇండియా 1-0తేడాతో ఆధిక్యంలోకి వచ్చింది. ఈ మ్యాచ్ విజయం భారత్ సాధించిన అత్యుత్తమ విజయాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఇప్పటివరకు 10వికెట్ల తేడాతో ఇండియా ఆరుసార్లు గెలవగా.. తాజా గెలుపుతో 7వ సారి గెలిచినట్లయింది. అయితే ఈ గెలుపు ఎందుకు స్పెషల్ అంటే గతంలో 10వికెట్ల తేడాతో కొన్ని చిన్న జట్లు, సాధారణ జట్లపై ఇండియా గెలిచింది. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత భీకర జట్టు, డిఫెండింగ్ వన్డే వరల్డ్ కప్ ఛాంపియన్ అయిన ఇంగ్లాండ్ మీద 10వికెట్ల తేడాతో గెలవడం నిజంగా అద్భుతమని చెప్పాలి.

ఇక ఓసారి వన్డేల్లో భారత్ 10వికెట్ల తేడాతో గెలిచిన సందర్భాలను గమనిస్తే..
1.1975లో లీడ్స్‌లో తూర్పు ఆఫ్రికా మీద 123/0 ఛేదించి తొలిసారి 10వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది.
2. 1984లో షార్జా వేదికగా శ్రీలంకపై 97/0
3. 1997లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికంగా వెస్టిండీస్‌పై 116/0
4.1998లో షార్జా వేదికగా జింబాబ్వేపై 197/0
5. 2001లో బ్లూంఫాంటైన్ వేదికగా కెన్యాపై 91/0
6.2006లో హరారే వేదికగా జింబాబ్వేపై 126/0
7.తాజాగా 2022లో ఓవల్ వేదికగా ఇంగ్లాండ్ లాంటి భీకర జట్టుపై భారత్ 10వికెట్ల తేడాతో గెలుపొందింది.

Story first published: Tuesday, July 12, 2022, 23:03 [IST]
Other articles published on Jul 12, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+