For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్ 7 సీక్రెట్స్: అండర్ వేర్‌లో టిష్యూలు పెట్టుకుని ఆడిన సచిన్

 7 Shocking Facts About Sachin Tendulkar Every Cricket Fan Needs to Know About

హైదరాబాద్: భారతరత్న, టీమిండియా లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఇవాళ తన 45వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. మాస్టర్ సాధించిన రికార్డులు, రివార్డులు, అవార్డుల గురించి అందరికీ తెలుసు. కానీ ఈ క్రికెట్ గాడ్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు చాలా మందికి తెలియవు. అందులో కొన్ని ఇప్పుడు చూద్దాం..

2003 వరల్డ్‌కప్‌లో సచిన్ పాకిస్థాన్‌పై ఆడిన ఇన్నింగ్స్‌ను ఎవరూ మరచిపోరు. కానీ అదే వరల్డ్‌కప్‌లో మాస్టర్ ఓ మ్యాచ్ సందర్భంగా అండర్‌వేర్‌లో టిష్యూస్ పెట్టుకొని ఆడిన విషయం తెలుసా.. తన ఆటోబయోగ్రఫీ ప్లేయింగ్ ఇట్ మై వే బుక్‌లో ఈ ఇబ్బందికర విషయాన్ని సచినే చెప్పుకున్నాడు.

భారత్ కంటే ముందు పాకిస్థాన్ తరపున ఆడిన సచిన్:

భారత్ కంటే ముందు పాకిస్థాన్ తరపున ఆడిన సచిన్:

ఇండియా తరఫున ఎవరూ సాధించని రికార్డులు సచిన్ పేరిట ఉన్నాయి. అయితే మాస్టర్ ఇండియా కంటే ముందే పాకిస్థాన్‌కు ఆడాడు. 1987, జనవరి 20న ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఇమ్రాన్‌ఖాన్ టీమ్‌కు సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా సచిన్ వ్యవహరించాడు. 25 నిమిషాల పాటు ఫీల్డింగ్ చేశాడు. పాక్‌లోని సీనియర్ ప్లేయర్స్ రెస్ట్ తీసుకోవడంతో తగినంత మంది లేక ఇలా కొందరు జూనియర్ ఇండియన్ ప్లేయర్స్‌ను ఆడించాల్సిందిగా ఇమ్రాన్‌ఖాన్ కోరాడు. ఇండియా తరఫున 1989లో అదే పాకిస్థాన్ టూర్‌లో అరంగేట్రం చేశాడు.

గత్యంతరం లేక అండర్ వేర్‌లో టిష్యూస్ పెట్టుకున్నా:

గత్యంతరం లేక అండర్ వేర్‌లో టిష్యూస్ పెట్టుకున్నా:

శ్రీలంకతో జరిగిన సూపర్‌సిక్స్ మ్యాచ్‌లో సచిన్ విరేచనాలతో బాధపడుతున్నాడు. దీంతో బ్యాటింగ్ మధ్యలో బయటకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తకుండా అండర్‌వేర్‌లో టిష్యూస్ పెట్టుకొని ఆడినట్లు సచిన్ చెప్పాడు. ఆ మ్యాచ్‌లో మాస్టర్ 97 రన్స్ చేశాడు. లంకతో మ్యాచ్‌లో నేను పూర్తిగా డీహైడ్రేట్ అయిపోయాను. చాలా ఎనర్జీ డ్రింక్స్ తాగాల్సి వచ్చింది. తొందరగా కోలుకోవడానికి అందులో చిటికెడు ఉప్పు వేసుకొని తాగాను. దీంతో విరేచనాలు మొదలయ్యాయి. మ్యాచ్ మొత్తం ఇబ్బందిపడ్డాను. మధ్యలో ఓసారి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాల్సి వచ్చింది. బ్యాటింగ్ చేసే సమయంలో అండర్‌వేర్‌లో టిష్యూస్ పెట్టుకున్నాను అని సచిన్ చెప్పాడు.

సచిన్ గుడ్డి నమ్మకాలు:

సచిన్ గుడ్డి నమ్మకాలు:

ఫిరోజ్ కోట్లా గ్రౌండ్‌లో పాకిస్థాన్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో అనిల్ కుంబ్లే పది వికెట్లు తీసుకున్న విషయం తెలుసు కదా. ఆ మ్యాచ్‌లో కుంబ్లే స్వెటర్, క్యాప్‌ను సచిన్ తీసుకొని అంపైర్‌కు ఇచ్చినప్పుడల్లా వికెట్ పడింది. దీంతో ఆ ఇన్నింగ్స్‌లో అన్ని వికెట్లు కుంబ్లే తీసుకునే వరకు సచిన్ అలా చేస్తూనే ఉన్నాడు.

థర్డ్ అంపైర్ అవుట్‌గా తెలిపిన మొదటి బ్యాట్స్‌మన్‌గా:

థర్డ్ అంపైర్ అవుట్‌గా తెలిపిన మొదటి బ్యాట్స్‌మన్‌గా:

క్రికెట్‌లో అన్ని రికార్డులను తన పేరిట రాసుకున్నాడు సచిన్. అలాగే మూడో అంపైర్ ఔట్ ఇచ్చిన తొలి బ్యాట్స్‌మన్‌గా కూడా రికార్డు బుక్కుల్లో చోటు సంపాదించాడు. 1992లో సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ సందర్భంగా మూడో అంపైర్‌గా వ్యవహరించిన కార్ల్ లీబెన్‌బర్గ్ సచిన్‌ను రనౌట్‌గా ప్రకటించాడు. మాస్టర్‌ను రనౌట్ చేసింది లెజెండరీ ఫీల్డర్ జాంటీ రోడ్స్ కావడం విశేషం.

అప్పుడు సచిన్ కు వయస్సు సరిపోలేదు:

అప్పుడు సచిన్ కు వయస్సు సరిపోలేదు:

1990లో టెస్టుల్లో సచిన్ తొలి సెంచరీ చేశాడు. ఆ సందర్భంగా అతనికి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు కింద ఓ షాంపైన్ బాటిల్ ఇచ్చారు. అప్పటికి సచిన్ వయసు 18 కంటే తక్కువ ఉండటంతో బ్రిటిష్ నిబంధనల ప్రకారం దాన్ని ఓపెన్ చేసే హక్కు సచిన్‌కు లేదు. దీంతో 8 ఏళ్ల తర్వాత తన కూతురు సారా బర్త్ డే సందర్భంగా ఆ బాటిల్‌ను సచిన్ ఓపెన్ చేయడం విశేషం.

అఫ్రిది సెంచరీ చేసింది సచిన్ బ్యాట్‌తోనే:

అఫ్రిది సెంచరీ చేసింది సచిన్ బ్యాట్‌తోనే:

1996, అక్టోబర్ 4.. ప్రపంచానికి బూమ్ బూమ్ అఫ్రిదిని పరిచయం చేసిన రోజది. ఆ రోజు వన్డే క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు అఫ్రిది. అది సచిన్ ఇచ్చిన బ్యాట్‌తోనే అన్న విషయం చాలా మందికి తెలియదు. అప్పుడే టీమ్‌లోకి రావడంతో అఫ్రిది దగ్గర సరైన క్రికెట్ కిట్ కూడా లేదు. సైక్లెన్ ముస్తాక్ అతనికి తన బూట్లు, హెల్మెట్ ఇచ్చాడు. ఇక వకార్ యూనిస్.. సచిన్ బ్యాట్‌ను అతనికి ఇచ్చాడు. దీంతో ఆడి చూడు.. ఇది సచిన్ బ్యాట్ అని వకార్ చెప్పాడు అని అఫ్రిది గల్ఫ్‌న్యూస్‌తో అన్నాడు.

స్నేహితుడి కంటే తక్కువే:

స్నేహితుడి కంటే తక్కువే:

సచిన్, వినోద్ కాంబ్లి ఎంత మంచి ఫ్రెండ్సో అందరికీ తెలిసిందే. తన క్రికెట్ కెరీర్‌ను కాంబ్లి చాలా త్వరగానే ముగించినా ఒక్క విషయంలో మాత్రం అతడు సచిన్‌ను మించాడు. కాంబ్లి టెస్ట్ సగటు 54.20. 17 టెస్టుల్లో 1084 రన్స్ చేశాడు. ఇక సచిన్ 200 టెస్టుల్లో 53.78 సగటుతో రన్స్ చేశాడు.

Story first published: Tuesday, April 24, 2018, 14:57 [IST]
Other articles published on Apr 24, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+