Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సన్‌రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్రకు ఏడు కారణాలు: అన్నింటికీ మించి..అదే హైలైట్

 7 Reasons How SRH Could Win 5 Consecutive Matches In IPL 2022

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భలే కలిసొచ్చింది. వరుసగా రెండు మ్యాచ్‌లల్లో అపజయాలతో ఈ సీజన్‌ను ఆరంభించినప్పటికీ.. ఆ తరువాత ఆరెంజ్ ఆర్మీ పుంజుకొన్న తీరు ఓ మాస్టర్ పీస్. ప్రారంభంలో పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో కనిపించిన కేన్ విలియమ్సన్ టీమ్.. పైకి ఎగబాకుతూ వచ్చిన విధానం ఓ అద్భుతం. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్, కోల్‌కత నైట్ రైడర్స్ వంటి బలమైన జట్లు అధ్వాన్నంగా ఆడుతోన్న ఈ సీజన్‌లో హైదరాబాద్ తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తోంది.

బెంగళూరుపై గెలుపు.. పీక్స్

బెంగళూరుపై గెలుపు.. పీక్స్

ముంబై వాంఖెడె స్టేడియంలో శనివారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును మట్టి కరిపించడంతో సన్‌రైజర్స్ విజృంభణ పీక్స్‌కు చేరినట్టయింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, కేన్ విలియమ్సన్ కేప్టెన్సీ.. ఇలా అన్నింట్లోనూ తిరుగులేని ఆధిపత్యాన్ని కనపరిచింది. 68 బంతులకు రాయల్ ఛాలెంజర్స్ బ్యాటింగ్ కుప్పకూలిన పిచ్‌పై దుమ్ము దులిపింది. ఎనిమిది ఓవర్లలోనే లక్ష్యాన్ని ఊదేసింది. ఈ క్రమంలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయింది సన్‌రైజర్స్.

 ఆ రెండింట్లో ఓడి.. చెన్నైపై గెలిచి..

ఆ రెండింట్లో ఓడి.. చెన్నైపై గెలిచి..

రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓడిన తరువాత- సన్‌రైజర్స్ ఖేల్ ఖతం అనే అనుకున్నారంతా. ఈ రెండు ఓటముల తరువాత మూడో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఎదుర్కోవాల్సి రావడంతో- మరో పరాజయం తప్పదనే భావించారు. అందరి అంచనాలను తలకిందులు చేసింది సన్‌రైజర్స్. చెన్నైపై ఆల్‌రౌండ్ ప్రతిభను కనపరిచింది. 154 పరుగులకే కట్టడి చేసి.. రెండు వికెట్లను కోల్పోయి దాన్ని ఛేదించింది. అభిషేక్ శర్మ 50 బంతుల్లో 75 పరుగులతో సత్తా చాటాడు. రాహుల్ త్రిపాఠి-39, కేన్-32 పరుగులు చేశారు.

గుజరాత్‌కు తొలి పరాజయం..

గుజరాత్‌కు తొలి పరాజయం..

తన నాలుగో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. ఆ జట్టుకు ఇదే తొలి ఓటమి. అప్పటివరకు ఆడిన మూడింట్లోనూ గెలిచింది హార్దిక్ పాండ్యా టీమ్. ఈ మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ బౌలర్లు విజృంభించారు..162 పరుగులకే పరిమితం చేశారు. ఈ లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది హైదరాబాద్. కేన్ విలియమ్సన్ తన మొదటి హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుంది ఈ మ్యాచ్‌లోనే. అభిషేక్ శర్మ మరోసారి రాణించాడు. నికొలస్ పూరన్ 18 బంతుల్లో 34 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

కోల్‌కతను వెంటాడి మరీ..

కోల్‌కతను వెంటాడి మరీ..

అయిదో మ్యాచ్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్ భారీ స్కోర్ సాధించినప్పటికీ.. దాన్ని వెంటాడి మరీ ఛేదించింది సన్‌రైజర్స్. 175 పరుగుల భారీ లక్ష్యాన్ని కేన్ సేన.. 17.5 ఓవర్లలోనే కొట్టేసింది. రాహుల్ త్రిపాఠి-ఎయిడెన్ మార్క్‌రమ్ ద్వయం కోల్‌కత బౌలర్లను చుక్కులు చూపించిందీ మ్యాచ్‌లో. త్రిపాఠి- 37 బంతుల్లో 71 పరుగులు, మార్కరమ్ 36 బంతుల్లో 68 పరుగులు చేశారు. అంత భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి ఛేదించింది.

పంజాబ్ కింగ్స్‌పై చెలరేగిన బౌలర్లు..

పంజాబ్ కింగ్స్‌పై చెలరేగిన బౌలర్లు..

తన ఆరో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై పైచేయి సాధించింది హైదరాబాద్. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టును 151 పరుగులకే కట్టడి చేసింది. చివరి అయిదు ఓవర్లలో హైదరాబాద్ బౌలర్లు ఏ స్థాయిలో చెలరేగారంటే- 19 పరుగులు మాత్రమే ఇచ్చారు. చివరి ఓవర్‌లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లు తీసుకున్నాడు. ఓ దశలో 200లను దాటుతుందనిపించిన పంజాబ్ కింగ్స్‌ను హైదరాబాద్ బౌలర్లు అడ్డుకున్నారు. అనంతరం ఆ టార్గెట్‌ను మూడు వికెట్ల నష్టంతో కొట్టేసింది హైదరాబాద్.

బౌలర్ల పని తనానికి పరాకాష్ఠ

బౌలర్ల పని తనానికి పరాకాష్ఠ

ఇక తాజాగా రాయల్ ఛాలెంజర్స్‌పై జరిగిన మ్యాచ్- హైదరాబాద్ బౌలర్ల పనితనానికి పరాకాష్ఠగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరును 68 పరుగులకే కుప్పకూల్చింది. ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో కూడా ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ అయ్యాడంటే.. హైదరాబాద్ బౌలర్ల పదును ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్‌‌ను బౌలర్లు వణికించారు. బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం నిలువునా కుప్పకూలింది.

 కేన్ మామ కేప్టెన్సీ..

కేన్ మామ కేప్టెన్సీ..

అన్నింటికీ మించి కేన్ విలియమ్సన్ కేప్టెన్సీకి ఈ వరుస విజయాలు అద్దం పట్టాయి. వరుసగా ఏడు మ్యాచ్‌లల్లో టాస్‌ను గెలవడం ఒక ఎత్తయితే.. ఫీల్డింగ్‌ను ఎంచుకుని ప్రత్యర్థిని చిత్తు చేయడం మరో ఎత్తు. శనివారం నాటి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ వికెట్ కోసం సెకెండ్ స్లిప్‌ను పెట్టడం కేన్ కేప్టెన్సీ మచ్చుతునక. బ్యాటర్లు ఏ దశలోనూ కోలుకోనివ్వకుండా వారిపై ఒత్తిడిని తీసుకొచ్చాడు. కేన్ వ్యూహాలకు అనుగుణంగా బౌలర్లు చెలరేగిపోయారు. బ్యాటింగ్ ఆర్డర్‌ పునాదులను కదిలించారు.

Story first published: Sunday, April 24, 2022, 9:23 [IST]
Other articles published on Apr 24, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+