Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సిరీస్‌-సిరీస్‌కు మధ్య తక్కువ సమయమే ఉన్నా ఆడడానికి సిద్ధం: కోహ్లీ

IND VS NZ 2020,1st T20I : Virat Kohli Is Unhappy With Tight Schedule ! || Oneindia Telugu
7 hours time difference difficult to adjust: Virat Kohli on tight scheduling of NZ tour

ఆక్లాండ్‌: గత ఆరు నెలలుగా సొంత గడ్డపై వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌, శ్రీలంక, ఆస్ట్రేలియాలతో జరిగిన వరుస సిరీస్‌లను కైవసం చేసుకున్న టీమిండియా.. న్యూజిలాండ్‌తో జరిగే విదేశీ పర్యటనలోనూ సత్తాచాటాలని చూస్తోంది. సుదీర్ఘ న్యూజిలాండ్‌ పర్యటనలో టీమిండియా ఐదు టెస్టులు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. శుక్రవారం ఆక్లాండ్‌లో జరిగే తొలి టీ20తో కివీస్ పర్యటన ప్రారంభం కానుంది. అయితే గత ఆరు నెలలుగా కొనసాగుతున్న బిజీ షెడ్యూల్‌పై టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ స్పందించాడు.

 బిజీ షెడ్యూల్‌పై స్పందించిన కోహ్లీ:

బిజీ షెడ్యూల్‌పై స్పందించిన కోహ్లీ:

టీ20 సిరీస్‌కు ముందు గురువారం కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ... 'ఇటీవలి కాలంలో చాలా క్రికెట్ ఆడాం. సిరీస్‌-సిరీస్‌కు మధ్య సమయం కుదించుకుపోతుంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ ఆడాం. అప్పుడు మైదానంలో ఎక్కువ సమయం గడిసాం. అంతకన్నా ముందు శ్రీలంకతో టీ20 సిరీస్‌ ఆడాం. భారత్‌ కన్నా ఏడు గంటల ముందు నడుస్తున్న న్యూజిలాండ్‌కు వచ్చి ఇంత త్వరగా సర్దుకోవడం చాలా కష్టం. టోర్నీ నిర్వాహకులు ఇలాంటి విషయాలపై భవిష్యత్‌లో దృష్టిసారిస్తారని ఆశిస్తున్నా' అని అన్నాడు.

న్యూజిలాండ్‌ను తక్కువ అంచనా వేయొద్దు:

న్యూజిలాండ్‌ను తక్కువ అంచనా వేయొద్దు:

'మరో ఆరు నెలల్లో టీ20 ప్రపంచకప్‌ ఉన్నందున మాకు ప్రతీ టీ20 మ్యాచ్ ఎంతో ముఖ్యం. ఈ నేపథ్యంలో కివీస్‌తో టీ20 సిరీస్‌ ఆరంభానికి ఎదురు చూస్తున్నాం. శ్రీలంకపై టీ20 సిరీస్‌, ఆసీస్‌పై వన్డే సిరీస్‌ గెలవడంతో అందరం ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. అయితే న్యూజిలాండ్‌ను సొంతగడ్డపై తక్కువ అంచనా వేయొద్దు. సొంతగడ్డపై ఆడటం కివీస్ జట్టుకు కలిసివస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు' అని కోహ్లీ పేర్కొన్నాడు.

ప్రతీకారమా?.. ఆ ఊహ కూడా లేదు:

ప్రతీకారమా?.. ఆ ఊహ కూడా లేదు:

'కివీస్‌ పిచ్‌లపై సారధి కేన్ విలియమ్సన్‌ జట్టుకు పూర్తి అవగాహన ఉంటుంది. మున్రో, టేలర్, గప్తిల్ బాగా రాణించగలరు. పోటీ ఆహ్లాదకరంగా ఉంటుందని ఆశిస్తున్నా. ఏదేమైనా గత పర్యటనలో న్యూజిలాండ్‌ జట్టును రెండు ఫార్మాట్లలో ఓడించాం, అదే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతాం. న్యూజిలాండ్‌ జట్టుతో ప్రతీకారమా? అలాంటి ఊహ కూడా మాకు రాదు. ఒక వేళ ప్రతీకారంగా భావించాలని అనుకున్నా ఇలాంటి మంచి జట్టుతో అలా చేయలేం. కివీస్‌ జట్టు సభ్యులందరితో మేం చాలా బాగా కలిసిపోతాం' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

చివరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమి:

చివరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమి:

ఇరు జట్ల మధ్య చివరిసారిగా 2019, ఫిబ్రవరిలో హామిల్టన్‌ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్‌కు.. న్యూజిలాండ్‌ భారీ టార్గెట్‌ విధించింది. మున్రో (72), సైఫెర్ట్‌ (43), గ్రాండ్‌హోమ్‌ (30) చెలరేగడంతో మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 212 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో రోహిత్‌ సేన 208/6 కు పరిమితమైంది. విజయ్‌ శంకర్‌ (43), రోహిత్‌ శర్మ(38), దినేశ్‌ కార్తీక్‌ (33 నాటౌట్‌) రాణించారు.

Story first published: Friday, January 24, 2020, 9:41 [IST]
Other articles published on Jan 24, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+