Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

7 ఐసీసీ టోర్నీలు.. ప్రతిసారి కొత్త విజేతనే! 2013లో భారత్.. 21లో న్యూజిలాండ్‌!!

7 Different Teams Won ICC Trophies In Last 7 Different ICC Events

హైదరాబాద్: ఐసీసీ ట్రోఫీ.. అన్ని క్రికెట్ జట్లకు ఎంతో ప్రత్యేకం. ఐసీసీ టైటిల్ పట్టాలని ప్రతిఒక్క టీమ్ కోరుకుంటది. కొన్ని జట్టుకు ఐసీసీ టైటిల్ గెలుచుకునేందుకు చాలా ఏళ్లు పట్టగా.. ఇంకొన్ని జట్లకు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఆఫ్ఘనిస్తాన్, జింబాంబ్వే , బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్లు ఒక్క టైటిల్ కూడా గెలవలేదు.

ఇక ఐసీసీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్ (డబ్ల్యూటీసీ) టైటిల్‌ను ఎట్టాకేలకు న్యూజిలాండ్ బుధవారం గెలుచుకుంది. దీంతో కివీస్ ఖాతాలో ఓ పెద్ద ఐసీసీ ట్రోఫీ చేరింది. అయితే గత ఏడేళ్లలో జరిగిన ఐసీసీ టోర్నీల్లో ప్రతిసారి కొత్త జట్టు విజేతగా నిలిచింది. ఏడు టోర్నీల్లో ఏడు జట్లు ట్రోఫీని ముద్దాడాయి. ఆ వివరాలు ఓసారి చూద్దాం.

2013 ఛాంపియన్స్ ట్రోఫీ

2013 ఛాంపియన్స్ ట్రోఫీ

ఇంగ్లండ్​లో జరిగిన 2013 ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ గెలిచింది. ఎడ్జ్​బాస్టన్ వేదికగా జరిగిన​ తుది పోరులో భారత్​, ఇంగ్లండ్ ​పోటీపడ్డాయి. వర్షం కారణంగా మ్యాచ్​ను 20 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్​ చేసిన ధోనీసేన 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. విరాట్​ కోహ్లీ (43), రవీంద్ర జడేజా (33) రాణించడంతో భారత్​ మెరుగైన స్కోరు చేసింది.

130 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 8 వికెట్లు కోల్పోయి కేవలం 124 పరుగులు చేసి ఓడిపోయింది. ఇయాన్ మోర్గాన్​ (33), రవి బొపారా (30) మంచి భాగస్వామ్యం నెలకొల్పినా.. తమ జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. చివరకు 5 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.

2014 టీ20 ప్రపంచకప్

2014 టీ20 ప్రపంచకప్

2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్​లో భారత్​తో తలపడిన శ్రీలంక విజేతగా నిలిచింది. ఢాకాలోని షేర్​ ఏ బంగ్లా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన టీమ్​భారత్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. యువరాజ్ సింగ్ జిడ్డు ఇన్నింగ్స్​ ఆడాడు. 21 బంతుల్లో కేవలం 11 పరుగులు చేశాడు. దీంతో భారత్​ రన్​రేట్ దారుణంగా పడిపోయింది. విరాట్ కోహ్లీ 77 పరుగులు తీసినప్పటికీ భారత్ కేవలం 130 పరుగులే చేయగలిగింది. అనంతరం బరిలోకి దిగిన లంక 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

2015 వన్డే ప్రపంచకప్

2015 వన్డే ప్రపంచకప్

2015 వన్డే ప్రపంచకప్ టోర్నీని ఆస్ట్రేలియా గెలిచింది. మెల్‌బోర్న్‌ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో ఏడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 45 ఓవర్లలో 183 రన్స్ చేసింది. గ్రాంట్ ఇల్లియట్ (83), రాస్ టేలర్ (40) రాణించారు. ఆపై కెప్టెన్ మైఖెల్ క్లార్క్ (74), స్టీవ్ స్మిత్ (56), డేవిడ్ వార్నర్ (45) రాణించడంతో 33.1 ఓవర్లలో ఆసీస్ గెలుపొందింది. 1987, 1999, 2003, 2007 సంవత్సరాలలో నిర్వహించిన వన్డే ప్రపంచకప్‌ టోర్నీల్లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది.

WTC Final 2021:టీమిండియాను ఓడించినంత మాత్రాన.. భారత అభిమానులకు మేం చెడ్డవాళ్లమైపోము!!

2016 టీ20 ప్రపంచకప్

2016 టీ20 ప్రపంచకప్

భారత్​లో జరిగిన 2016 టీ20 ప్రపంచకప్ టోర్నీ తుది పోరులో ఇంగ్లండ్-వెస్టిండీస్​ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. జో రూట్‌ (54), జొస్ బట్లర్‌ (36), డేవిడ్‌ విల్లీ (21) ఫర్వాలేదనిపించాడు.విండీస్‌ బౌలర్లలో బ్రావో, బ్రాత్‌వైట్‌ తలో మూడు వికెట్లు తీశారు. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరేబియన్‌ జట్టు మరో రెండు బంతులు ఉండగానే గెలిచింది.

12 బంతుల్లో 27 పరుగులు చేయాల్సిన సమయంలో క్రిస్‌ జోర్డాన్‌ వేసిన 19వ ఓవర్‌లో శాముల్స్‌, బ్రాత్‌వైట్‌లు తడబడ్డారు. దీంతో చివరి ఓవర్‌లో విండీస్‌ విజయానికి 19 పరుగులు అవసరమయ్యాయి. స్టోక్స్‌ వేసిన చివరో ఓవర్‌లో వరుసగా నాలుగు బంతులను భారీ సిక్సర్లుగా మలచి విండీస్‌కు విజయాన్ని అందించాడు.

2017 ఛాంపియన్స్ ట్రోఫీ

2017 ఛాంపియన్స్ ట్రోఫీ

2017 ఛాంపియన్స్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్థులు భారత్​-పాకిస్థాన్ కప్ కోసం​ తలపడ్డాయి. అయితే అన్ని మ్యాచ్​ల్లో నిలకడగా ఆడిన కోహ్లీసేన.. ఫైనల్​లో మాత్రం చేతులెత్తేసింది. దీంతో పాక్ 180 పరుగుల భారీ తేడాతో గెలిచి విజేతగా నిలిచింది. 2019 వన్డే ప్రపంచకప్ టోర్నీ ఫైనల్​లో న్యూజిలాండ్​తో ఇంగ్లండ్ తలపడింది. మ్యాచ్, సూపర్​ ఓవర్​ కూడా టై అవ్వడంతో బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లీష్ జట్టు విజేతగా నిలిచింది. ఇక ఐసీసీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తొలిసారి నిర్వహించిన టెస్టు ఛాంపియన్​షిప్ 2021 టోర్నీలో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది.

Story first published: Thursday, June 24, 2021, 15:51 [IST]
Other articles published on Jun 24, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+