రోహిత్ కొట్టిన సిక్స్‌కు గాయపడ్డ చిన్నారికి సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపించిన ఇంగ్లాండ్ టీం

భారత్ - ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ టైంలో కొట్టిన ఓ భారీ సిక్సర్‌కు బంతి వెళ్లి స్టాండ్స్‌లో ఉన్న ఓ ఆరేళ్ల చిన్నారికి తాకింది. ఈ అనూహ్య ఘటనతో మైదానంలో ఉన్న ప్లేయర్లు, ప్రేక్షకులు, కామెంటేటర్లు కాసేపు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. డేవిడ్ విల్లే వేసిన 5వ ఓవర్‌లో రోహిత్ తనదైన పుల్ షాట్‌తో భారీ సిక్సర్ బాదాడు.
స్టాండ్స్‌లో ఉన్న జనంవైపు దూసుకెళ్లిన బంతి మ్యాచ్ చూసేందుకు తన తండ్రితో వచ్చిన చిన్నారి మీరా సాల్వికి బలంగా తాకింది. దాంతో ఆమె నొప్పితో విలవిలలాడింది. వెనువెంటనే ఫిజియోలు ఆమె చెంతకు వెళ్లి పరిస్థితిని ఆరా తీశారు. ఇక పెద్ద ప్రమాదేం కాకపోవడంతో కాసేపు ఆగిన ఆట మళ్లీ పునప్రారంభమైంది. రోహిత్ సైతం కాసేపు ఆందోళన చెందాడు. తిరిగి క్రీజులోకి వచ్చాడు. ఇక ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జోరూట్.. చిన్నారికి తగలకుండా బంతిని పట్టుకోకుండా ఏం చేస్తున్నారని పక్కనున్న ప్రేక్షకులను తన సైగలతో వారించాడు. ఇక చిన్నారికి మెడికల్ కేర్ అందించారు. ఆమె కోలుకుంది. ఇక ఆమెను ఇంగ్లాండ్ టీం మేనేజ్ మెంట్ సర్ ప్రైజ్ చేసింది. అఫిషియల్ జెర్సీని ఆ చిన్నారికి అందించింది. ఇక ఈ జెర్సీని అందుకున్న మీరా సాల్వి ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications