Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియాలోకి వచ్చిన 6గురు ఐపీఎల్ స్టార్లు వీళ్లే.. ఫ్రాంచైజీలకు రూ.కోట్లు నష్టం!

ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ రూల్స్‌‌ను బీసీసీఐ ప్రకటించింది. ఆరుగురు ప్లేయర్లను ఓ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకునే వెసులుబాటు ఇచ్చింది. అయితే గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు మాత్రమే ఛాన్స్ కల్పించింది. రిటెన్షన్ పాలసీ ప్రకారం నేరుగా నిర్ణయించిన ధరతో రిటైన్ చేసుకోవచ్చు లేదా ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా దక్కించుకోవచ్చు.

అక్టోబర్ 31వ తేదీలోపు తమ రిటెన్షన్ లిస్ట్‌ను అన్ని ఫ్రాంచైజీలు సమర్పించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు, రూ.11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, అయిదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ.18 కోట్లు, రూ.14 కోట్లు చెల్లించాలి. ఈ నిర్ణీత ధర కంటే ఎక్కువ మొత్తాన్ని ఇచ్చే ఆలోచన ఫ్రాంచైజీలకు బీసీసీఐ వదిలేసింది. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను రిటైన్ చేసుకుంటే మాత్రం రూ.4 కోట్లుగా నిర్ణయించింది.

6 Indian IPL Sensations Who Recently Made Their T20I Debut

అయితే ఐపీఎల్-2024 ముగిసిన తర్వాత ఏకంగా ఆరుగురు స్టార్లు టీమిండియాలోకి అరంగేట్రం చేశారు. దీంతో వాళ్లకు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు అనే ట్యాగ్ పోయింది. మరోవైపు ఇది ఫ్రాంచైజీలకు ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపనుంది. రూ.4 కోట్లతో రిటైన్ చేసుకునే వెసులుబాటు పోయి కనీసం రూ.11 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత మూడు నెలల్లో భారత జట్టులోకి వచ్చిన ఆటగాళ్లు ఎవరెవరంటే..

అభిషేక్ శర్మ (సన్‌రైజర్స్ హైదరాబాద్)
నితీశ్ కుమార్ రెడ్డి (సన్‌రైజర్స్ హైదరాబాద్)
రియాన్ పరాగ్ (రాజస్థాన్ రాయల్స్)
మయాంక్ యాదవ్ (లక్నో సూపర్ జెయింట్స్)
తుషార్ దేశ్‌పాండే (చెన్నై సూపర్ కింగ్స్)
సాయి సుదర్శన్ (గుజరాత్ టైటాన్స్).

Story first published: Monday, October 7, 2024, 9:48 [IST]
Other articles published on Oct 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+