Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

6,6,6,6,6,6.. ఆరు బంతుల్లో 6 సిక్సర్లు

ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకల్లో మునిగిపోయేందుకు సిద్ధమవుతుండగా.. క్రికెట్ మైదానంలో మాత్రం సిక్సర్ల వర్షం కురిసింది. 2025 చివరి రోజున జరిగిన SA20 లీగ్ (2025-26) 8వ మ్యాచ్‌లో డెవాల్డ్ బ్రెవిస్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. వీరిద్దరూ కలిసి వరుసగా 6 బంతుల్లో 6 సిక్సర్లు బాది స్టేడియంను హోరెత్తించారు.

ఇద్దరు బ్యాటర్లు.. ఒకే రికార్డు
ఈ అద్భుత ఘట్టం ప్రిటోరియా క్యాపిటల్స్, ఎంఐ కేప్‌టౌన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటుచేసుకుంది. 18వ ఓవర్ చివరి రెండు బంతులు, 19వ ఓవర్ మొదటి నాలుగు బంతుల్లో ఈ రికార్డు నమోదైంది. కార్బిన్ బాష్ వేసిన 18వ ఓవర్ చివరి రెండు బంతులను డెవాల్డ్ బ్రెవిస్ వరుసగా సిక్సర్లుగా మలిచాడు. ఆ తర్వాత స్ట్రైకింగ్ తీసుకున్న షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, డ్వేన్ ప్రిటోరియస్ వేసిన 19వ ఓవర్ మొదటి నాలుగు బంతులను స్టాండ్స్‌లోకి పంపాడు. ఇలా ఇద్దరు ప్లేయర్లు కలిసి ఒకే వరుసలో 6 సిక్సర్లు బాదడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విధ్వంసం వల్ల కేవలం 6 బంతుల్లోనే 36 పరుగులు వచ్చాయి.

6 Balls 6 Sixes Brevis and Rutherford Create History in SA20 2025-26

బ్యాటింగ్‌లో మెరుపులు.. బౌలింగ్‌లో రూథర్‌ఫోర్డ్ మాయ
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ కేవలం 15 బంతుల్లో 6 సిక్సర్లతో 47 పరుగులు (నాటౌట్) చేశాడు. డెవాల్డ్ బ్రెవిస్ 13 బంతుల్లో 4 సిక్సర్లు, 1 ఫోర్‌తో 36 పరుగుల (నాటౌట్)తో విధ్వంసం సృష్టించాడు. వీరితో పాటు విహాన్ లుబ్బే (60), షాయ్ హోప్ (45) రాణించారు.

అనంతరం 221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎంఐ కేప్‌టౌన్, ప్రిటోరియా బౌలర్ల ధాటికి తలవంచింది. కేవలం 14.2 ఓవర్లలో 135 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బ్యాటింగ్‌లో మెరిసిన రూథర్‌ఫోర్డ్, బౌలింగ్‌లోనూ 4 వికెట్లు తీసి ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. కేశవ్ మహారాజ్ 3 వికెట్లు పడగొట్టి తన వంతు సహకారం అందించారు.

Story first published: Thursday, January 1, 2026, 8:20 [IST]
Other articles published on Jan 1, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+