కెరీర్‌లో చివరి టెస్టు ఆడుతోన్న కుక్‌కు టీమిండియా ఘన స్వాగతం (వీడియో)

హైదరాబాద్: తన కెరీర్‌లో చివరి టెస్టు ఆడుతోన్న ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్‌కు ఘన స్వాగతం లభించింది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా చివరిదైన ఐదో టెస్టు ప్రారంభమైంది. ఓవల్ వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో టాస్ గెలిచిన ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.
దీంతో ప్రేక్షకుల కరతాల ధ్వనుల మధ్య అలెస్టర్ కుక్ మైదానంలోకి రాగా.. సముచిత గౌరవం కల్పిస్తూ టీమిండియా క్రికెటర్లు ఓ వరుసలో నిలబడి ఘన స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. అలెస్టర్ కుక్‌కు ఇదే చివరి టెస్టు.
అలెస్టర్ కుక్‌కి ఇదే చివరి టెస్టు
ఈ మ్యాచ్ తర్వాత అతను ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ కానున్నాడు. ఇప్పటికే టెస్టు సిరిస్‌ను 1-3తో సొంతం చేసుకున్న ఇంగ్లాండ్ జట్టు ఈ మ్యాచ్‌ను నెగ్గి కుక్‌ను విజయంతో సాగనంపాలని భావిస్తోంది. మరోవైపు, చివరి టెస్టులోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని కోహ్లీసేన భావిస్తోంది.
2016లోనే 10వేల పరుగుల మైలురాయిని
33 ఏళ్ల కుక్ ఇప్పటివరకు టెస్టుల్లో ఇంగ్లాండ్ జట్టు తరుపున 160 టెస్టులు ఆడిన కుక్.. 12254 పరుగులు చేశాడు. ఇందులో 32 సెంచరీలు, 56 అర్ధ శతకాలు ఉన్నాయి. టెస్టుల్లో కుక్ యావరేది 44.88గా ఉంది. 2016లో 10వేల పరుగుల మైలురాయిని చేరుకున్న అతి చిన్న క్రికెటర్‌గా రికార్డు కుక్ సృష్టించాడు. ఈ ఫీట్‌ని అతను 31 సంవత్సరాల, 157 రోజుల్లో సాధించాడు.
అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా
ఇంగ్లాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఐదో టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు జో రూట్ మాట్లాడుతూ "అలిస్టర్ కుక్ చాలా కింది స్థాయి నుంచి సూపర్ స్టార్‌గా ఎదిగాడు. అతను కేవలం చేసిన పరుగుల ద్వారా గొప్ప క్రికెటర్ అవ్వలేదు.. వ్యక్తిత్వంతోనూ అందరి మన్నలు పొందాడు. కుక్ రిటైర్మెంట్ బాధించే అంశం. ఒక క్రికెటర్‌గా మేము అతడ్ని అర్థం చేసుకున్నాం. 12 ఏళ్లు క్రికెట్ ఆడాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అలెస్టర్ కుక్ రికార్డులు:
ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్టు పరుగులు: 12254
ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్టు సెంచరీలు: 32
ఇంగ్లండ్ తరఫున అత్యధిక 150+ స్కోర్లు : 11
ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్టులు : 160
విరామం లేకుండా అత్యధిక టెస్టులు ఆడిన ప్లేయర్ : 158 టెస్టులు
ఇంగ్లండ్ కెప్టెన్‌గా అత్యధిక టెస్టులు: 59
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications