కెప్టెన్‌గా కోహ్లీ అరుదైన ఘనత: అజారుద్దీన్ రికార్డు సమం
హైదరాబాద్: ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో చివరిదైన చెన్నై టెస్టులో ఇంగ్లాండ్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్‌పై ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. చివరి రోజు ఆటలో 7 ఓవర్లు ఉండగానే భారత్ సంచలనం విజయాన్ని నమోదు చేసింది.
ఈ విజయంతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 4-0తో భారత్ కైవసం చేసుకుంది. ఈ టెస్టులో ఏడు వికెట్లు తీసుకుని భారత్ విజయంలో జడేజా కీలక పాత్ర పోషించాడు. రెండు ఇన్నింగ్స్ లు కలిపి జడేజా 10 వికెట్లు తీసుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరిస్‌లో రాజ్ కోట్‌లో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగియగా ఆ తర్వాత జరిగిన నాలుగు టెస్టుల్లో భారత్ విజయం సాధించింది.
ఇంగ్లాండ్‌పై తొలిసారి 4-0తో భారత్ సిరిస్‌ను కైవసం చేసుకుంది. 2012 టెస్టు సిరిస్ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. 1999 తర్వాత వరుసగా రెండు టెస్టుల్లో ఇన్నింగ్స్ విజయాలను భారత్ కైవసం చేసుకుంది. టెస్టుల్లో భారత్‌కు ఇది వరుసగా 18 విజయం కావడం విశేషం కాగా, మరొకవైపు 2015 నుంచి వరుసగా ఐదో టెస్టు సిరీస్ విజయం.
ఈ సిరీస్ విజయంతో ఇంగ్లాండ్ చేతిలో 2011, 2012, 2014లలో ఎదురైన పరాభవాలకు మొత్తంగా భారత్ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. సిరిస్‌లో భాగంగా రాజ్‌కోట్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ డ్రా అవ్వగా ఆ తర్వాత జరిగిన వరుసగా నాలుగు టెస్టు విజయాలతో కోహ్లిసేన సిరీస్‌ను కైవసం చేసుకుంది.

ఇంగ్లాండ్‌పై భారత్‌కు ఇదే అతి పెద్ద గెలుపు
ఇంగ్లాండ్‌పై భారత్‌కు ఇది అతి పెద్ద గెలుపు. అంతక ముందు 1992-93లో ఇంగ్లాండ్‌పై 3-0తో భారత్ విజయం సాధించింది. ముఖ్యంగా చివరి రెండు మ్యాచుల్లో ఏకంగా ఇన్నింగ్స్ విజయాలతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించడాన్ని క్రీడా విశ్లేషకులు అభినందిస్తున్నారు. ఈ టెస్టు విజయంతో కోహ్లీ అరుదైన ఘనతను సాధించాడు.

కోహ్లీకి 14వ టెస్టు విజయం
ఈ టెస్టు విజయం కోహ్లీకి 14వ గెలుపు. ఈ విజయంతో కోహ్లీ మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ గెలుపు రికార్డుని సమం చేశాడు. చెన్నై టెస్టులో యువ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ (303 నాటౌట్) త్రిశతకం, కేఎల్ రాహుల్ (199) సెంచరీతో చెలరేగి భారత్ విజయం కీలకపాత్ర పోషించారు.

అజారుద్దీన్ సరసన చేరిన కోహ్లీ
చెన్నై టెస్టు విజయంతో భారత్‌కు అత్యధిక విజయాలనందించిన కెప్టెన్ల జాబితాలో అజారుద్దీన్ సరసన కోహ్లీ చేరాడు. అజారుద్దీన్ కెప్టెన్సీలో 47 మ్యాచ్‌లాడిన భారత జట్టు 14 టెస్టుల్లో విజయం సాధించింది. అయితే కోహ్లీ మాత్రం 22 టెస్టుల్లోనే 14 విజయాలను అందుకున్నాడు.

655 పరుగులతో టాప్ స్కోరర్
ఇంగ్లాండ్‌తో ముగిసిన ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో అటు బ్యాట్స్‌మెన్‌గా, ఇటు కెప్టెన్‌గా కోహ్లీ ఎంతో పరిణతతో వ్యవహరించాడు. ఇంగ్లాండ్ సిరిస్‌లో 8 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ 655 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. అందులో రెండు సెంచరీలు, రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఈ సిరిస్‌లో కోహ్లీ తన కెరీర్ లోనే అత్యధిక స్కోరు (235)ని నమోదు చేశాడు.

కోహ్లీకి వరుసగా ఐదో టెస్టు సిరిస్ విజయం
ఇంగ్లాండ్‌పై సిరిస్ విజయం కోహ్లీకి వరుసగా ఐదో టెస్టు సిరిస్ విజయం. అంతకముందు 2015లో శ్రీలంకపై (2-1), దక్షిణాఫ్రికాపై (3-0), వెస్టిండిస్‌పై (2-0), న్యూజిలాండ్‌పై (3-0) కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా విజయం సాధించింది. 60 టెస్టుల్లో 27 టెస్టు విజయాలతో ధోని మొదటి స్ధానంలో ఉండగా, 49 మ్యాచ్‌ల్లో 21 టెస్టు విజయాలతో సౌరభ్ గంగూలీ రెండో స్ధానంలో కొనసాగుతున్నారు.

తక్కువ కాలంలో అద్భుతమైన విజయాలు
2014 డిసెంబర్‌లో టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న కోహ్లీ అతి తక్కువ కాలంలో అద్భుతమైన విజయాలను భారత్‌కు అందించాడు. భారత టెస్టు జట్టుకు కోహ్లీ 32వ కెప్టెన్‌గా ఉన్నాడు. కెప్టెన్‌గా భారత్‌కు అత్యధిక విజయాలను అందించిన వారు (టాప్ 5):
* 27 (60 matches) - MS Dhoni
* 21 (49) - Sourav Ganguly
* 14 each - Virat Kohli (22), Mohammad Azharuddin (47)
* 9 each - Sunil Gavaskar (47), Mansur Ali Khan Pataudi (40)
* 8 (25) - Rahul Dravid
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications