Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

500వ టెస్ట్: కోహ్లీకి ఫ్యాన్స్ నో ఛాన్స్, కెప్టెన్‌గా ధోనీయే

బెంగళూరు: భారత క్రికెట్ 'బెస్ట్ టెస్ట్ ఎలెవన్' సారథిగా అభిమానులు మహేంద్ర సింగ్ ధోనీని ఎంపిక చేశారు. విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమిండియా చారిత్రక 500వ టెస్టులో న్యూజిలాండ్‌తో తలపడి గెలిచింది. చారిత్రక విజయం సాధించింది.

చారిత్రాత్మక 500 టెస్ట్ నేపథ్యంలో బీసీసీఐ ఫ్యాన్స్‌కు ఓ ఆఫర్ ఇచ్చింది. మీ డ్రీమ్ టీంను ఎంపిక చేయాలని కోరింది. దీనికి మంచి స్పందన వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫలితాలను సోమవారం నాడు బీసీసీఐ విడుదల చేసింది.

టెస్ట్ టీం కెప్టెన్‌గా ధోనీని అభిమానులు ఎంపిక చేశారు. దివాల్ రాహుల్ ద్రావిడ్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. అతనికి 96 శాతం ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో కపిలే దేవ్.. 91 శాతంతో ఉన్నాడు. ఆసక్తికర విషయమేమంటే యువరాజ్ సింగ్‌ను 12వ ఆటగాడిగా ఎంపిక చేశారు.

MS Dhoni

సచిన్ టెండుల్కర్‌కు 73 శాతం ఓట్లు వచ్చాయి. సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా బీసీసీఐ డ్రీమ్ టీంను విడుదల చేసింది. 500వ టెస్ట్ నేపథ్యంలో అభిమానుల డ్రీం టీంను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, కోహ్లీకి స్థానం దక్కలేదు.

అభిమానుల డ్రీం టీం ఇదీ

1. సునీల్ గవాస్కర్ (68% ఓట్లు) 2. వీరేంద్ర సెహ్వాగ్ (86%) 3. రాహుల్ ద్రావిడ్ (96%) 4. సచిన్ టెండుల్కర్ (73%) 5. వీవీఎస్ లక్ష్మణ్ (58%) 6. కపిల్ దేవ్ (91%) 7. మహేంద్ర సింగ్ ధోనీ (సారథి, వికెట్ కీపర్) (90%) 8. రవిచంద్రన్ అశ్విన్ (53%) 9. అనిల్ కుంబ్లే (92%) 10. జవగల్ శ్రీనాథ్ (78%) 11. జహీర్ ఖాన్ (83%) 12. యువరాజ్ సింగ్(62 %)

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+