500 సిక్సులు: ట్వంటీ20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డుని నెలకొల్పిన క్రిస్‌గేల్
బెంగుళూరు: రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఓపెనర్ క్రిస్ గేల్ అంతర్జాతీయ ట్వంటీ20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డుని నెలకొల్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 8వ ఎడిషన్‌లో భాగంగా బుధవారం బెంగుళూరులో ఎమ్ చిన్నసామి స్టేడియంలో రాజస్ధాన్ రాయల్స్ జట్టుపై ఈ ఫీట్‌ని సాధించాడు.
ఐపీఎల్ చరిత్రలో 200 సిక్సులు కొట్టి సరికొత్త రికార్డుని నెలకొల్పిన ఈ జమైకన్ ఆటగాడు, ఎమ్ చిన్నసామి స్టేడియంలో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌తో (201 ట్వంటీ 20 గేమ్స్‌లో) 500 సిక్సులు బాది ప్రపంచ రికార్డుని సృష్టించాడు. ఐపీఎల్‌లో ఏప్రిల్ 13న సన్ రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ 200వ సిక్స్‌ను కొట్టిన విషయం తెలిసిందే.

ట్వంటీ20ల్లో 500 సిక్సులు కొట్టిన ఒకే ఒక ఆటగాడు క్రిస్ గేల్ మాత్రమే. 438 సిక్సులతో వెస్టిండిస్‌కు చెందిన కీరన్ పొలార్డ్ ఆ తర్వాతి స్ధానంలో ఉన్నాడు. రాజస్ధాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ 4 బంతుల్లో 10 పరుగులు చేశాడు. అందులో ఒక సిక్స్, ఒక ఫోర్ ఉండటం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications