Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముంబై చారిత్రాత్మక మ్యాచ్‌: వాంఖడె వేదికగా రంజీల్లో 500 మ్యాచ్‌

హైదరాబాద్: ముంబై రంజీ జట్టు అరుదైన ఘనత సాధించింది. దేశంలో మరే జట్టుకూ సాధ్యం కాని రీతిలో రంజీల్లో 500వ మ్యాచ్‌ ఆడుతోంది. ముంబైలోని వాంఖడె స్టేడియం ఇందుకు వేదిక అయింది. గురువారం బరోడాతో జరిగే మ్యాచ్‌ రంజీల్లో ముంబైకి 500వది. ఈ నేపథ్యంలో ముంబై క్రికెట్‌ సంఘం (ఎంసీఏ) మ్యాచ్‌కు ఘనంగా ఏర్పాట్లు చేసింది.

రంజీల్లో ముంబై అత్యధిక మ్యాచ్‌లు ఆడటంతో పాటు అత్యధికసార్లు విజేతగా నిలిచిన జట్టుగా నిలిచింది. ఇప్పటివరకు ముంబై రంజీల్లో 41 సార్లు విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. విజయ్‌ మర్చంట్‌, సునీల్‌ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ లాంటి ఎంతో మంది దిగ్గజాలు ముంబై రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. అంతేకాదు భారత జట్టుకు అత్యధిక మంది క్రికెటర్లను అందించిన ఘనత కూడా ముంబైదే.

ముంబై భాషలో ఆప్యాయంగా చెప్పుకునే ఖడూస్‌ (మొండి పట్టుదల) శైలి ఆ జట్టును, ఆటగాళ్లను అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రత్యేకంగా మార్చిందని చెప్పొచ్చు. మొత్తం 499 మ్యాచ్‌లలో ముంబై 242 గెలిచి 26 ఓడింది. మరో 231 మ్యాచ్‌లు 'డ్రా' చేసుకుంది. 500వ మ్యాచ్‌ ఆడుతున్న ముంబయికి క్రికెట్ లెజెండ్ సచిన్‌ శుభాకాంక్షలు చెప్పాడు.

నేను ఎంతో నేర్చుకున్నాను: సచిన్

నేను ఎంతో నేర్చుకున్నాను: సచిన్

'ముంబై రంజీ జట్టు ఎంతో మంది అత్యుత్తమ ఆటగాళ్లను అందించింది. ఇక్కడే నేను ఎంతో నేర్చుకున్నాను. మేమందరం ముంబయి తరఫున రంజీల్లో ఆడటం ద్వారా ఎంతో నేర్చుకున్నాం. సింహం బొమ్మ ఉన్న జెర్సీని ధరించడాన్ని ప్రతీ ముంబై క్రికెటర్‌ గర్వంగా భావిస్తాడు. పాత విజయాలు చూసుకొని సంబరపడిపోకుండా మళ్లీ అంతే పట్టుదలతో ఆడటం వల్లే ముంబై వరుసగా విజయాలు సాధిస్తోంది' అని సచిన్‌ అన్నాడు.

ఎన్నడూ ఓటమిని అంగీకరించని తత్వం జట్టు సొంతం

ఎన్నడూ ఓటమిని అంగీకరించని తత్వం జట్టు సొంతం

మరో క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ 'ముంబై క్రికెట్‌లో గట్టి పోటీ ఉండటమే ఆ జట్టు బలం. ఎన్నడూ ఓటమిని అంగీకరించని తత్వం జట్టు సొంతం. విఫలమైతే మరో అవకాశం దక్కడం చాలా కష్టం కాబట్టి ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తారు' అని అన్నాడు. తాజా మ్యాచ్‌ నేపథ్యంలో ముంబై రంజీ జట్టుకు సంబంధించిన కొన్ని విశేషాలు మీ కోసం...

ముంబై జట్టు తరుపున సత్తా చాటిన ఆటగాళ్లు

ముంబై జట్టు తరుపున సత్తా చాటిన ఆటగాళ్లు

అత్యధిక పరుగులు: వసీం జాఫర్‌ (9759),

అత్యధిక వికెట్లు: పద్మాకర్‌ శివాల్కర్‌ (361),

అత్యుత్తమ బౌలింగ్‌: అంకిత్‌ చవాన్‌ (9/23),

సీజన్‌లో అత్యధిక పరుగులు: శ్రేయస్‌ అయ్యర్‌ (1321),

అత్యధిక స్కోరు: 855/6 డిక్లేర్డ్‌ (హైదరాబాద్‌పై).

టాప్‌-5 వ్యక్తిగత స్కోర్లు:

టాప్‌-5 వ్యక్తిగత స్కోర్లు:

సంజయ్‌ మంజ్రేకర్‌ (377), విజయ్‌ మర్చంట్‌ (359 నాటౌట్‌), సునీల్‌ గావస్కర్‌ (340), అజిత్‌ వాడేకర్‌ (323), వసీం జాఫర్‌ (314 నాటౌట్‌).

ఇతర దేశవాళీ జట్ల అత్యధిక టైటిల్స్‌: న్యూసౌత్‌వేల్స్‌ (ఆస్టేలియా-షెఫీల్డ్‌ షీల్డ్‌) 46; యార్క్‌షైర్‌ (ఇంగ్లండ్‌- 34); హైవెల్డ్‌ లయన్స్‌ (దక్షిణాఫ్రికా-29); ఆక్లాండ్‌ ఏసెస్, (న్యూజిలాండ్‌ -23).

తొలి రంజీ ట్రోఫీని గెలిచిన ముంబై

తొలి రంజీ ట్రోఫీని గెలిచిన ముంబై

1934-35లో జరిగిన తొలి రంజీ ట్రోఫీని ముంబై (అప్పటి బాంబే) గెలుచుకుంది. మొత్తం 83 సార్లు రంజీ ట్రోఫీ జరిగితే 41 టైటిల్స్‌ సాధించిన ముంబై మొత్తంగా 46 సార్లు ఫైనల్‌ చేరింది. కేవలం 5 ఫైనల్స్‌లో మాత్రమే ఆ జట్టు ఓటమి పాలైంది. 1958-59 సీజన్‌ నుంచి 1972-73 సీజన్‌ వరకు ముంబై వరుసగా 15 సార్లు విజేతగా నిలిచింది. ఎనిమిది సార్లు రంజీ విజేతగా నిలిచిన జట్లలో వసీం జాఫర్‌ సభ్యుడిగా ఉన్నాడు. ముంబై 100, 200, 300, 400వ రంజీ మ్యాచ్‌లలో విజయాలు అందుకుంది.

Story first published: Monday, November 13, 2017, 12:18 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+