
హైదరాబాద్: భారత జట్టు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్‌గా పేరుగాంచిన జస్ప్రీత్ బుమ్రా బాలింగ్ యాక్షన్‌కి ఓ చిన్నారి ఫిదా అయ్యాడు. ఇప్పుడు ఆ బాలుడు అచ్చం బుమ్రాలాగే బౌలింగ్ వేస్తుండటం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బుమ్రాకి వీరాభిమాని అయిన ఓ పాకిస్థానీ బాలుడు మైదానంలో తన స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా ఎవరో వీడియో తీసి దానిని ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. "పాక్‌కు చెందిన ఐదేళ్ల బాలుడు మీ వీరాభిమాని. ఇటీవల జరిగిన ఆసియా కప్ సిరీస్‌లో మీరు చేసిన బౌలింగ్ చూసి, అప్పటి నుంచి మిమ్మల్ని అనుకరిస్తూ బౌలింగ్ చేస్తున్నాడు" అంటూ ఓ యువకుడు ఈ వీడియోను బుమ్రాకు ట్వీట్ చేశాడు.
మైదానంలో బుమ్రా ఏ విధంగా పరుగెత్తుతూ వచ్చి బౌలింగ్ చేస్తాడో అచ్చం అలాగే ఆ బాలుడు బంతి విసిరాడు. దీనిపై బుమ్రా కూడా తన ట్విట్టర్‌లో స్పందించాడు. "నా బాల్యంలో నేను కూడా నా క్రికెట్ హీరోలను అనుకరించేవాడిని. ఇప్పుడు ఓ చిన్నారి నన్ను అనుకరిస్తూ బౌలింగ్ చేయడం చూశాను. ఇది నాకు చాలా అద్భుతమైన ఫీలింగ్" అని బుమ్రా రీట్వీట్ చేశాడు.