For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఢిల్లీ కుర్రోడు ఇరగదీశాడు: 2.3 ఓవర్లు, 5 వికెట్లు, 0 రన్స్

ఢిల్లీ క్రికెటర్ హర్ష త్యాగి క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ స్కూల్ కప్ టీ20 టోర్నీలో భాగంగా నోయిడాలోని సెక్టార్-34 గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనతను సాధించాడు.

By Nageshwara Rao

న్యూఢిల్లీ: ఢిల్లీ క్రికెటర్ హర్ష త్యాగి క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ స్కూల్ కప్ టీ20 టోర్నీలో భాగంగా నోయిడాలోని సెక్టార్-34 గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనతను సాధించాడు. బిల్లాబోంగ్ ఇంటరేషనల్ హైస్కూల్, గురుకుల్ స్కూల్ జట్ల మధ్య నవంబర్ 25న జరిగిన మ్యాచ్‌లో 2.3 ఓవర్లు వేసిన త్యాగి ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 5 వికెట్లు తీశాడు.

ఢిల్లీ క్రికెట్‌లో హర్ష త్యాగి పేరు వినిపించడం ఇదే తొలిసారి కాదు. ఢిల్లీ రాష్ట్రం తరుపున అండర్-19 జట్టుకి కూడా త్యాగి ప్రాతినిథ్యం వహించాడు. ప్రస్తుతం ఢిల్లీ అండర్-23 జట్టు తరుపున ఆడుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లాడిన త్యాగి 17 వికెట్లు తీసుకున్నాడు. త్యాగి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.

5 wickets for 0 runs, Delhi's Harsh Tyagi might well be India's next sensation

కాగా ఈ టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బిల్లాబోర్డ్ నిర్ణీత 20 ఓవర్లకు గాను 261 పరుగులు సాధించింది. ఆ తర్వాత 262 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించడంలో గురుకుల్ జట్టు విఫలమైంది. త్యాగి అద్భుతమైన బౌలింగ్‌తో గురుకుల్ జట్టు 46 పరుగులకే ఆలౌటైంది.

2.3 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా త్యాగి 5 వికెట్లు తీసుకున్నాడు. గురుకుల్ జట్టులో 8వ స్ధానంలో బ్యాటింగ్‌కు దిగిన బ్యాట్స్‌మెన్ చేసిన 13 పరుగులే అత్యధిక పరుగులు కావడం విశేషం. ఈ టోర్నీ నిర్వాహకులు సైతం త్యాగి బౌలింగ్ రికార్డుకి ముగ్ధులయ్యారు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+