
రాహుల్ సెంచరీ:
రెండో టెస్ట్ మ్యాచులో టీమిండియాకు పునాది పడిందంటే అది ఓపెనర్ కేఎల్ రాహుల్ (127; 248 బంతుల్లో 12x4, 1x6) సెంచరీ చేయడంతోనే. తొలిరోజు ఉదయం వర్షం పడడంతో పిచ్ పేసర్లకు అనుకూలించింది. అయినా ఇంగ్లండ్ బౌలర్లను రాహుల్ సమర్థంగా ఎదుర్కొన్నాడు. మొదటగా క్రీజులో కుదురుకోవడానికి సమయం తీసుకున్న రాహుల్.. ఆపై గేర్ మార్చాడు. రోహిత్ శర్మ అండతో హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో గతంలో ఎన్నడో లేని విధంగా భారత ఓపెనర్లు ఇంగ్లీష్ గడ్డపై 100కు పైగా పరుగులు చేశారు. అనంతరం వికెట్లు పడుతున్నా.. ఒంటరి పోరాటం చేసి సెంచరీ చేశాడు. అనంతరం రిషబ్ పంత్, రవీంద్ర జడేజాల సహకారంతో భారత్ 364 పరుగులు చేయగలిగింది.

షమీ, బుమ్రా భాగస్వామ్యం:
నాలుగో రోజు ఆట చివరికి చూస్తే ఇంగ్లండ్‌దే పైచేయి. విజయానికి కూడా అవకాశాలు ఉన్నాయి. రహానే, పుజారా పోరాడడంతో భారత్ ఆధిక్యం 154 పరుగులు మాత్రమే. రిషబ్ పంత్ తప్ప మిగిలిన వాళ్లంతా టెయిలెండర్లే. అయిదో రోజు చివరి నాలుగు వికెట్లను పడగొట్టి మ్యాచ్‌పై పట్టుబిగించవచ్చని ఇంగ్లండ్ భావించింది. ఇక పంత్, ఇషాంత్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే నిష్క్రమించడంతో భారత్ ఓటమి ఖాయం అనుకున్నారు అందరూ. కానీ టెయిలెండర్లు (56 నాటౌట్; 70 బంతుల్లో 6×4, 1×6), బుమ్రా (34 నాటౌట్; 64 బంతుల్లో 3×4) అభేద్యమైన 9వ వికెట్‌కు ఏకంగా 89 పరుగులు జోడించి.. భారత్‌కు ప్రమాదాన్ని తప్పించారు. అంతేకాకుండా గెలుపు కోసం ప్రయత్నించే అవకాశం కల్పించారు. షమి-బుమ్రా జోడీ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. ఇక్కడే కోహ్లీసేన సగం విజయం సాధించింది.

సిరాజ్‌ది కీలకపాత్ర:
లార్డ్స్‌లో భారత జట్టు విజయంలో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌ది కీలకపాత్ర అనే చెప్పాలి. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసి రూట్ సేనను మరీ ఎక్కువ ఆధిక్యం సాధించకుండా చూసిన సిరాజ్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ నాలుగు వికెట్ల ప్రదర్శనతో జట్టును గెలిపించాడు. మ్యాచ్ డ్రా దిశగా సాగుతున్న స్థితిలో అతడి సంచలన బౌలింగే జట్టుకు విజయాన్నందించింది. ముందుగా మొయిన్ అలీ-జోస్ బట్లర్ పట్టుదలగా ఆడుతూ క్రీజులో పాతుకుపోతున్న సమయంలో వరుస బంతుల్లో అలీ, కరన్‌లను ఔట్ చేసి దెబ్బకొట్టాడు. ఇక మ్యాచ్ ముగియడానికి మరికొన్ని ఓవర్లే ఉన్న సమయంలో ఒకే ఓవర్లో బట్లర్, అండర్సన్‌ను పెవిలియన్ చేర్చి.. భారత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు.

వివాదాలు ఓ కారణమే:
రెండో టెస్టులో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం తార స్థాయిలో జరిగింది. టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగడంతో.. ఆధిపత్యం చెలాయించేందుకు ఇంగ్లండ్, భారత్ జట్ల ఆటగాళ్లు గొడవలు పడ్డారు. మూడో రోజు ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్, భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మధ్య ఘర్షణ చోటు చేసుకుంటే.. ఆదివారం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అండర్సన్ మధ్య అగ్గి రాజుకుంది. చివరి రోజు బుమ్రాని రెచ్చగొట్టారు ఇంగ్లండ్ ప్లేయర్స్. మార్క్ వుడ్, అండర్సన్ షార్ట్ పిచ్ బంతులతో బుమ్రాని గాయపర్చే ప్రయత్నం చేస్తూనే తమ నోటికి పని చెప్పారు. బట్లర్ కూడా బుమ్రాపై మాటల యుద్దానికి దిగాడు. దాంతో బుమ్రా కూడా భారీ షాట్లు ఆడుతూ.. నోటితోనూ సమాధానమిచ్చాడు. ఆపై అదే కసితో నాలుగు వికెట్లు పడగొట్టాడు. గొడవలు కూడా భారత్ విజయానికి ఓ కారణమే చెప్పాలి.

ఓవర్ మధ్యలోనే ఇన్నింగ్స్ డిక్లేర్:
సోమవారం ఓవర్ నైట్ స్కోరు 181/6తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్.. షమీ, బుమ్రా పరుగులు చేయడంతో ఊహించని విధంగా భారీ స్కోర్ చేసింది. చివరి రోజు ఆటలో ఇంకో 60 ఓవర్ల ఆట ఉండగా..109.3 ఓవర్లకు 298/8 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది భారత్. ఇక్కడ భారత్ సాహసం చేసిందనే అనే చెప్పాలి. ఎపుడైనా ఓవర్ అయ్యాక ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తారు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం ఓవర్ మధ్యలోనే డిక్లేర్ చేశాడు. వీలైనంత త్వరగా ఇంగ్లండ్ జట్టును ఆడించాలని కోహ్లీ అలా చేసిఉంటాడు. ఇదే కలిసొచ్చింది. మ్యాచ్ అనంతరం కూడా విరాట్ ఇదే చెప్పాడు. 60 ఓవర్లలో వారిని ఆలౌట్ చేయొచ్చని జట్టులో స్ఫూర్తి నింపాడు.


Click it and Unblock the Notifications












