For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలవడానికి 5 ప్రధాన కారణాలివే

5 Reasons How Gujarat Titans Become IPL 2022 Champions

ఐపీఎల్ 2022 సీజన్‌ టైటిల్‌ను గుజరాత్ టైటాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ 7వికెట్ల తేడాతో గెలుపొంది అరంగేట్రం చేసిన తొలి సీజన్లోనే టైటిల్ ముద్దాడిన జట్టుగా నిలిచింది. ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌ను నిర్ణీత 20ఓవర్లలో 130పరుగులకు గుజరాత్ కట్టడి చేసింది. కాగా.. ఛేదనలో గుజరాత్ టైటాన్స్ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 133పరుగులు చేసి గెలుపొందింది. శుభ్‌మన్ గిల్(43 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 45 నాటౌట్), డేవిడ్ మిల్లర్(19 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 32 నాటౌట్), హార్దిక్ పాండ్యా(30 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 34) రాణించడంతో గుజరాత్ విజయదుందుభీ మోగించింది. ఇక అరంగేట్ర సీజన్లోనే గుజరాత్ ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో 5ప్రధాన కారణాలు..

ఒకరిద్దరి మీద ఆధారపడే జట్టు కాదు

ఒకరిద్దరి మీద ఆధారపడే జట్టు కాదు

ఐపీఎల్ 2022 సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టు ప్రధాన బలం ఏంటంటే సమిష్టిగా ఆడడం. సీజన్ ప్రారంభమైనప్పుడు శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్ మాత్రమే ఈ జట్టును నడిపించే స్టార్లు అని అంతా భావించారు. అయితే ఈ అంచనా తప్పని రుజువైంది. వీరితో పాటు జట్టులో ఉన్న దాదాపు ప్రతి ఒక్కరూ జట్టుకు ఉపయోగపడేలా ఆడారు. ఓపెనింగ్లో సాహా, మిడిలార్డర్ల్లో మిల్లర్, ఫినిషింగ్లో తెవాతీయా ఒకరు కాకుంటే మరొకరు జట్టును ఆదుకునేందుకు రెడీగా నిలబడ్డారు. ఎవరో ఒకరి మీద భారం నెట్టేసేలా ఏ మ్యాచ్‌లోనూ గుజరాత్ టైటాన్స్ ప్రదర్శన కనబర్చలేదు. బౌలింగ్లో షమీ దాదాపుగా రాణించాడు. అతనికి తోడుగా.. అల్జారీ జోసెఫ్, ఫెర్గూసన్ మంచి లయ కనబరిచారు. యష్ దయాల్ సైతం తగినంత మేరకు తన ప్రభావం చూపాడు. ఇక చివరి మ్యాచ్‌లలో సాయి కిషోర్ లాంటి దేశీయ ప్లేయర్ సైతం ఆకట్టుకున్నాడు. తొలి మ్యాచ్‌లలో అభినవ్ మనోహర్, సుదర్శన్, ప్రదీప్ సాంగ్వాన్ లాంటి ప్లేయర్లు ఆకట్టుకున్నారు.

 ఫినిషింగ్లో అదుర్స్ టీం

ఫినిషింగ్లో అదుర్స్ టీం

ఇకపోతే గుజరాత్ టైటాన్స్ టీం ఛేజింగ్లో అద్భుతమైన జట్టుగా పేరొందింది. ఇక లీగ్ దశలో గెలిచిన 10 మ్యాచుల్లో 6 మ్యాచ్‌ల్లో ఛేజింగ్లోనే గెలిచింది. ఇక ప్లేఆఫ్ క్వాలిఫయర్ మ్యాచ్‌లోనూ, ఫైనల్లోనూ ఛేజింగ్లోనే గెలిచింది. ఇక ఆ టీంకు మంచి ఫినిషర్లు ఉన్నారు. మిల్లర్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాతీయా లాంటి ఫినిషర్లు.. అత్యంత ఒత్తిడిలోనూ చాలా మ్యాచ్‌లు గెలిపించారు. ఇక ఛేదనలో అయిదు సార్లు చివరి ఓవర్‌లో 11లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేయాల్సి ఉండగా గుజరాత్ గెలుపొందింది. ఈ ఐదు మ్యాచ్‌లలో మూడింటిలో చివరి ఓవర్‌లో 16లేదా అంతకంటే ఎక్కువ పరుగులు అవసరమైన దశలో గుజరాత్ గెలుపొందింది. ఆ మూడు మ్యాచ్‌లలో ప్రతి మ్యాచ్ బ్యాక్-టు-బ్యాక్ సిక్సర్లతో ఆ జట్టు ప్లేయర్లు రాహుల్ తెవాతీయా, రషీద్ ఖాన్, మిల్లర్ ముగించడం గమనార్హం.

 వ్యక్తిగతంగా కన్నా భాగస్వామ్యాలే ప్రధానంగా..

వ్యక్తిగతంగా కన్నా భాగస్వామ్యాలే ప్రధానంగా..

గుజరాత్ టైటాన్స్ విజయం ఫార్ములాలో ప్రధాన ఫార్ములా ఇదే. వచ్చామా కాసేపు హిట్టింగ్ చేశామా, ఔటయ్యామా అనే ధోరణి ఆ జట్టు ప్లేయర్లలో కన్పించలేదు. ఆ జట్టుకు ఉన్న ప్రధాన స్ట్రాటెజీ మంచి పార్ట్‌నర్‌షిప్‌లు నమోదు చేయడం. ముఖ్యంగా శుభ్ మాన్ గిల్, సాహా ఓపెనింగ్ దిగినప్పుడు సాహా హిట్టింగ్ మొదలెడితే.. గిల్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ పార్ట్ నర్ షిప్ బిల్డింగ్ చేస్తాడు. ఒకవేళ గిల్ అవుటయితే సాహా తన అటాక్‌ను కాస్త తక్కువ చేసి వికెట్ కాపాడుతాడు. ఇక మాథ్యు వేడ్ విఫలమైనప్పటికీ.. హార్దిక్ పాండ్యా మాత్రం అవసరమైనంత మేరకు క్రీజులో ఉండాలనే ధోరణిలో ఆడుతూ పార్ట్ నర్ షిప్ బిల్డ్ చేయాలని చూస్తాడు. క్వాలిఫయర్ 1లో మిల్లర్ హార్దిక్ జోడీ, ఫైనల్లో హార్దిక్, గిల్ జోడీ ఎంత చక్కగా ఇన్నింగ్స్ బిల్డ్ చేశారో మనం చూశాం. ఎందుకంటే చివర్లో తమ జట్టులో మంచి ఫినిషర్లు ఉన్నారు కాబట్టి.. ఇన్నింగ్స్ ను రిక్వైర్డ్ రన్ రేట్‌తో నడిపిస్తే చాలు.. తప్పకుండా తమ జట్టు వైపు ఎడ్జ్ ఉంటుందని ఆ జట్టు వ్యూహం. దానికి తగ్గట్లే ఆ జట్టు ఆడింది. గెలిచింది.

 హార్దిక్ పాండ్యా ఆకట్టుకునే కెప్టెన్సీ

హార్దిక్ పాండ్యా ఆకట్టుకునే కెప్టెన్సీ

జట్టు ఇంత సమిష్టిగా రాణించడానికి ప్రధాన కారణం కెప్టెన్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ. అతను చాలా సందర్భాల్లో చెప్పిందేంటంటే.. జట్టులోని ప్రతి ప్లేయర్ కెప్టెన్ లాగా ఫీలవ్వాలని చూస్తానని, తాను మిగతావాళ్ల కంటే ఏమాత్రం ఎక్కువ కాదని పేర్కొన్నాడు. అందువల్లే ఆ జట్టు ప్లేయర్లు తమ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించారు. ఒకప్పుడు అగ్రెస్సివ్ బ్యాటర్ అయిన హార్దిక్.. పరిస్థితులను అవగాహన చేసుకుంటూ ఆడుతూ తనలోని అత్యుత్తమ ఆటను బయటకు తీశాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో హార్దిక్ షమీని ఉపయోగించుకుని వికెట్లు పడగొట్టాలని చూడడం, మిడిల్ ఓవర్లలో రషీద్ ఖాన్ ద్వారా స్కోరుకు కళ్లెం వేయాలని చూడడం, డెత్ ఓవర్లలో వేరియేషన్ స్పెల్స్ ఉండేలా చూసుకోవడం లాంటి మార్క్ కెప్టెన్సీ చూపెట్టాడు. కెప్టెన్సీ భారం వల్ల చాలా మంది ప్లేయర్లు తమ వ్యక్తిగత ఆటను కోల్పోతుంటే.. పాండ్యా మాత్రం మరింత అద్భుతంగా రాణించాడు. ఈ సీజన్లో టైటాన్స్ తరఫున 487పరుగులు చేశాడు. అలాగే ఫైనల్లో అత్యుత్తమ బౌలింగ్, బ్యాటింగ్ ప్రదర్శనతో తన జట్టును విజయ తీరాలకు చేర్చాడు.

 ఆశిష్ నెహ్రా, గ్యారీ కిర్ స్టెన్ కోచింగ్

ఆశిష్ నెహ్రా, గ్యారీ కిర్ స్టెన్ కోచింగ్

ఇక గ్రౌండ్లో గుజరాత్ టైటాన్స్ ఎలా ఆడుతున్నా.. దాని వెనకాల ఆ జట్టు వ్యూహాల్లో మాత్రం కీలక పాత్ర పోషించింది ఆ జట్టు ప్రధాన కోచ్‌లు ఆశిష్ నెహ్రా, గ్యారీ కిర్ స్టెన్. స్ట్రాటెజిక్ టైం అవుట్‌ను ఆశిష్ నెహ్రా చాలా సమర్థవంతంగా ఉపయోగించుకుంటాడు. తప్పకుండా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు క్రీజులో ఉన్న బ్యాటర్లతోని, బౌలింగ్ చేస్తున్నప్పుడు జట్టుతోని మాట్లాడుతాడు. అతను ఆద్యంతం మ్యాచ్ గమనించడమే కాకుండా బౌండరీ వద్ద నిల్చుని అవసరమైన వ్యూహాలను హార్దిక్‌కు అందజేస్తాడు. జట్టు సమతూకం తేవడంలో, జట్టు సెలక్షన్ విషయంలోనూ గ్యారీ కిర్ స్టెన్, ఆశిష్ నెహ్రా చాలా పక్కాగా వ్యవహరించారు. జట్టులో బ్యాటర్ల ప్లేయింగ్ స్థానాలను తరచూగా మార్చుతూ హడావుడి చేయలేదు. బౌలింగ్లో యష్ దయాల్ ను టాప్ క్లాస్ బౌలర్‌గా రాణించేలా చూసి.. షమీపై ఒత్తిడి పడకుండా చూడగలిగారు.

Story first published: Monday, May 30, 2022, 13:35 [IST]
Other articles published on May 30, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+