
ఇంతకుముందే నలుగురికి పాజిటివ్
ఇంతకుముందే పాకిస్థాన్ పర్యటనలో ఉన్న వెస్టిండీస్ జట్టులోని నలుగురు కరోనా బారిన పడ్డారు. ఇందులో ముగ్గురు ఆటగాళ్లు, ఒకరు సహాయక బృందంలోని వ్యక్తి ఉన్నారు. వీరికి శనివారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటవ్‌గా తేలింది. శనివారం కరోనా బారిన పడిన వారిలో రోష్టన్ ఛేజ్, షెల్డన్ కాట్రెల్, కైల్ మేయర్స్ అనే ఆటగాళ్లు ఉన్నారు. వీరితోపాటు జట్టు సహాయక బృందంలోని ఒక వ్యక్తికి కరోనా సోకింది. కాగా కరోనా వైరస్ సోకిన ఈ తొమ్మిది మందిని ఐసోలేషన్‌కు తరలించి, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తెలిపింది.

సిరీస్‌లో వెనుకంజలో విండీస్
ఇక మ్యాచ్ విషయానికి వస్తే పాకిస్థాన్ పర్యటనలో పర్యాటన జట్టు వెస్టిండీస్ 3 టీ20 మ్యాచ్‌లతోపాటు 3 వన్డేలు కూడా ఆడుతోంది. ఇప్పటికే రెండు టీ20 మ్యాచ్‌లు ముగియగా.. ఆ రెండింటిలోనూ కరేబియన్లు ఓటమి పాలయ్యారు. దీంతో విండీస్ సిరీస్‌ను కోల్పోయింది. ఇక సిరీస్‌లో చివరిదైన మూడో టీ20 నేడు జరగనుంది. ఈ మ్యాచ్‌లోనైనా నెగ్గి పాక్ గడ్డపై పరువు నిలుపుకోవాలనుకున్న వెస్టిండీస్‌కు కరోనా రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాగా టీ20 సిరీస్ ముగిసిన అనంతరం ఈ నెల 18,20, 22వ తేదీల్లో ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్ జరగాల్సి ఉంది.

కరోనా దెబ్బతో వన్డే సిరీస్‌పై నీలి నీడలు
వెస్టిండీస్ జట్టులోని ఆరుగురు ఆటగాళ్లతోపాటు ముగ్గురు సహాయకబృందంలోని వ్యక్తులు కరోనా బారిన పడడంతో వన్డే సిరీస్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. నేడు సాయంత్రం ఇరు జట్ల మధ్య ఓ టీ20 మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ కరోనా కేసులు విండీస్ జట్టులో అధికంగా నమోదవడంతో ఈ మ్యాచ్‌లన్నీ నిర్వహిస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. త్వరలోనే దీనిపై ఇరు జట్ల బోర్డులు ఓ నిర్ణయం తీసుకోనున్నాయని సమాచారం.


Click it and Unblock the Notifications












