For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG 3rd Test: టీమిండియా పతనాన్ని శాసించిన ఆ అయిదు తప్పులు ఇవే

5 Mistakes Which Team India Made On Day 1 vs England At Headlingley Leeds
IND VS ENG: Team India దుమ్మురేపిన ఆ జట్టేనా ? అభిమానుల్లో ఆగ్రహావేశాలు || Oneindia Telugu

లండన్: అయిదు టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో ఆడుతోన్న మూడో మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ విఫలం కావడం ఆందోళనకు గురి చేస్తోంది. టీమిండియా స్వయంకృతాపరాధంగా దీన్ని పరిగణిస్తోన్నారు క్రికెట్ పండితులు. భారత జట్టు ఖాతాలో టెస్టుల్లో మరోసారి లోయెస్ట్ స్కోర్‌ను నమోదు కావడం విమర్శల నోళ్లకు కూడా పని చెప్పినట్టయింది. రోహిత్ శర్మ, అజింక్య రహానె మినహా మరెవరూ డబుల్ డిజిట్‌ను అందుకోలేకపోయారు. రెండో టెస్ట్‌ను గెలిచిన ఓ జట్టు.. మూడో టెస్ట్‌లో కనీసం ప్రతిఘటన కూడా ఇవ్వకుండా చేతులెత్తేయడం పట్ల అటు అభిమానుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమౌతోన్నాయి.

బౌలర్లదీ అదే బాట..

బౌలర్లదీ అదే బాట..

బ్యాటింగే అనుకుంటే బౌలర్లు కూడా ఘోరంగా విఫలం అయ్యారు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లపై ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఇంగ్లాండ్ బౌలర్లు నిప్పుల్లాంటి బంతులను సంధించిన పిచ్ మీద రాణించలేకపోయారు. ఒక్క వికెట్‌ను కూడా పడగొట్టలేకపోయారు. ఏ మాత్రం ఫామ్‌లో లేని రోరీ బర్న్స్, ఈ సిరీస్‌లో రెండో టెస్ట్ ఆడుతోన్న హసీబ్ హమీద్ అర్ధసెంచరీలను నమోదు చేశారు. 42 ఓవర్లను విసిరినప్పటికీ ఓపెనర్ల భాగస్వామ్యాన్ని విడదీయలేకపోయారు. ఇషాంత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా చేతులెత్తేశారు.

మూడో టెస్ట్‌లో నిస్సారంగా..

మూడో టెస్ట్‌లో నిస్సారంగా..

నాటింగ్ హామ్, లార్డ్స్ టెస్ట్ మ్యాచుల్లో సత్తా చాటిన టీమిండియా.. హెడింగ్లేకు వచ్చే సరికి నీరుగారిపోయినట్టు కనిపించింది. కొమ్ములు తిరిగిన బ్యాట్స్‌మెన్లు ఒకరివెంట ఒకరు పెవిలియన్ దారి పట్టారు. తొలి ఓవర్ నుంచే భారత జట్టు పతనం ఆరంభమైంది. స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్, క్రెగ్ ఓవర్టన్, ఒల్లీ రాబిన్సన్, సామ్ కర్రమ్‌లకు అలవోకగా తలవంచింది. కనీసం పోరాడలేకపోయింది. అండర్సన్, ఓవర్టన్ మూడు, రాబిన్సన్, సామ్ కర్రమ్ రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు. సునాయాసంగా భారత్‌పై ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.

కారణాలేంటీ..టీమిండియా చేసిన పొరపాట్లేంటీ?

కారణాలేంటీ..టీమిండియా చేసిన పొరపాట్లేంటీ?

బ్యాటింగ్ విభాగంలో టీమిండియా భారీ స్కోరును అందుకోలేకపోవడం, బౌలింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో అదే వైఫల్యం కొనసాగించడం విశ్లేషకుల మెదళ్లకు పని పెట్టాయి. దీనికి గల కారణాలను వివరిస్తోన్నారు క్రికెట్ పండితులు. అయిదు ప్రధాన కారణాలను వారు వివరించారు. అవన్నీ సాంకేతికంగా అంగీకరించదగ్గవే. బ్యాటింగ్‌లో విఫలం కావడానికి, బౌలర్లు చేతులెత్తేయడానికి మధ్య టీమిండియా కొన్ని స్వయంకృతాపరాధాలకు పాల్పడినట్లు చెబుతున్నారు అనలిస్టులు.

షాట్ సెలెక్షన్..

షాట్ సెలెక్షన్..

టీమిండియా బ్యాట్స్‌మెన్ల షాట్ సెలెక్షన్ ఏ మాత్రం సంతృప్తికరంగా లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రత్యేకించి డ్రైవ్‌ల విషయంలో అనేక పొరపాట్లు చేశారు. దానికి ఉదాహరణ.. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లందరూ వికెట్ కీపర్ జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ కావడం. బంతి వేగం, కదలికలను తక్కువగా అంచనా వేయడం వల్లే టైమింగ్ మిస్ అయ్యారు. తొలి ఓవర్ అయిదో బంతిగా అండర్సన్ విసిరిన ఇన్‌స్వింగర్‌ను అర్థం చేసుకోవడంలో తడబడ్డాడు కేఎల్ రాహుల్. ఎలా ఆడాలో తెలియక తికమక పడ్డాడు. నాలుగో ఓవర్‌లో చేతేశ్వర్ పుజారా పెవిలియన్ బాట పట్టాడు. కేఎల్ రాహుల్ అవుట్ అయిన విధానానికి రీప్లే చూస్తున్నట్టనిపించింది.

కవర్ డ్రైవ్స్ మీద డిపెండ్..

కవర్ డ్రైవ్స్ మీద డిపెండ్..

10వ ఓవర్ అయిదో బంతికి కోహ్లీ బ్యాటెత్తేశాడు. అండర్సన్ వేసిన అవుట్ స్వింగర్‌ను మిడాఫ్ దిశగా డ్రైవ్ చేయబోయాడు..అది సక్సెస్ కాలేదు. టైమింగ్ మిస్ కావడంతో బంతి మళ్లీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న ఆ బంతిని బట్లర్ అందుకున్నాడు. విరాట్ కోహ్లీ అవుటైన తీరు పట్ల సునీల్ గవాస్కర్ కూడా తప్పు పట్టారు. కవర్ డ్రైవ్‌లో అతని బలహీనతలేమిటో బయటపడిందని, లోపాన్ని సరిచేసుకోలేదు బ్యాట్స్‌మెన్లు. నేరుగా స్టంప్స్ మీదికి వచ్చిన బంతులను డ్రైవ్స్ చేయడంలో విఫలం కావడం వల్ల అవి కాస్తా ప్యాడ్స్‌కు తగిలి ఎల్బీగా వెనుదిరగడం కూడా ఓ ప్రధాన కారణం. వెంటవెంటనే రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా ఎల్బీగా వెనుదిరగడానికి రీజన్ ఇదే.

 లైన్ అండ్ లెంగ్త్ మిస్

లైన్ అండ్ లెంగ్త్ మిస్

బ్యాట్స్‌మెన్ల వైఫల్యాన్ని బౌలర్లు కూడా కంటిన్యూ చేశారు. 42 ఓవర్లు బౌల్ చేసినప్పటికీ.. ఒక్క వికెట్‌ను కూడా పడగొట్టలేకపోయారంటే వారు ఏ రేంజ్‌లో ఫెయిల్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. లైన్ అండ్ లెంగ్త్‌ను దొరకబుచ్చుకోవడంలో తంటాలు పడ్డారు. ఇంగ్లాండ్ బౌలర్లు నిప్పులు చెరిగిన అదే పిచ్ మీద మనవాళ్లు ఘోరంగా విఫలం కావడం.. కట్టుదిట్టంగా బంతులు వేయకపోవడమేననేది విశ్లేషకుల అంచనా. బౌలర్లందరూ లూజ్ బంతులను సంధించారు. రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించడానికి ప్రధాన కారకులైన బౌలర్లు వీరేనా అనుమానాలను రేకెత్తించేలా చేశారు.

సిరాజ్‌ను ఆలస్యంగా దించడం..

సిరాజ్‌ను ఆలస్యంగా దించడం..

రెండో టెస్ట్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను ఆలస్యంగా అటాకింగ్‌కు దింపడం కూడా ఓ కారణమని విశ్లేషకులు అంచనా వేస్తోన్నారు. కొత్తబంతితో సిరాజ్ అద్భుతాలను సృష్టిస్తాడనే విషయం తెలిసినప్పటికీ.. విరాట్ కోహ్లీ అతని చేతికి బంతిని ఆలస్యంగా ఎందుకు ఇచ్చాడనేది అంతుచిక్కట్లేదని వ్యాఖ్యానిస్తోన్నారు. ఇషాంత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా ప్రభావం చూపట్లేదనది తెలిసిన వెంటనే బౌలింగ్ విభాగంలో మార్పులు చేయాల్సి ఉన్నప్పటికీ.. టీమిండియా కేప్టెన్ ఆ పని చేయకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

సరిదిద్దుకోకపోతే..

సరిదిద్దుకోకపోతే..

బంతి సిరాజ్ చేతికి అందేసరికి పాతబడిందని, దానితో అతను ప్రయోగాలను చేయలేకపోయాడనేది స్పష్టమౌతోంది. ఈ లోపాలను సరి చేసుకోవాల్సిన బాధ్యత టీమిండియాపై ఉంది. రెండో ఇన్నింగ్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగితే ఆధిక్యాన్ని కోల్పోవడం మాట అటు ఉంచితే.. ఇంగ్లాండ్ డామినేట్ చేయడానికి చేతులారా అవకాశం కల్పించినట్టవుతుందని అంటోన్నారు విశ్లేషకులు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో ఎంత త్వరగా బౌన్స్ బ్యాక్ కాగలిగితే అంత బెటర్ అని స్పష్టం చేస్తోన్నారు.

Story first published: Thursday, August 26, 2021, 11:30 [IST]
Other articles published on Aug 26, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+