Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వచ్చే ఐదేళ్లలో కోహ్లీ బద్దలు కొట్టనున్న రికార్డులు ఇవే

హైదరాబాద్: మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. ఈ ఏడాది పది సెంచరీలు సాధించిన విరాట్ కోహ్లీ ఆ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. తద్వారా పాంటింగ్ (9 సెంచరీలు), గ్రేమ్ స్మిత్ (9)ల రికార్డుని అధిగమించాడు. అంతేకాదు వన్డేల్లో వేగంగా 9 వేల పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా, ఛేజింగ్‌లో ఎక్కువ సెంచరీలు (18) సాధించిన క్రికెటర్‌గా అరుదైన గుర్తింపు పొందాడు. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరిస్‌లో అనేక రికార్డులను సైతం నెలకొల్పాడు. టెస్ట్ కెరీర్‌లో ఐదు డబుల్ సెంచరీలను నమోదు చేశాడు. ఈ క్రమంలో కెప్టెన్‌గా వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా (5 డబుల్ సెంచరీలు) రికార్డును సమం చేశాడు.

కోహ్లీ ఇదే జోరు కొనసాగిస్తే వచ్చే ఐదేళ్లలో ఏయే రికార్డులు సాధించే అవకాశం ఉందో ఒక్కసారి పరిశీలిద్దాం...

భారత్‌కు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్

భారత్‌కు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్

భారత్‌కు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు. టెస్టుల్లో భారత్‌కు 27 విజయాలు అందించిన ధోని, 110 వన్డేల్లో టీమిండియాను గెలిపించాడు. వన్డే కెప్టెన్‌గా అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో రికీ పాంటింగ్ మాత్రమే ధోని కంటే ముందున్నాడు. కోహ్లీ నేతృత్వంలో భారత్‌ 33 టెస్టులాడగా 20 విజయాలు అందించాడు. మరో మూడు టెస్టుల్లో గెలుపొందితే గంగూలీ రికార్డును అధిగమిస్తాడు. 2019లోగా ధోని రికార్డుని బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఇక, వన్డేల్లో కోహ్లీ సేన 43 మ్యాచ్‌లు ఆడితే 33 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. మరో 78 మ్యాచ్‌ల్లో గెలుపొందితే వన్డేల్లోనూ ధోని రికార్డును అధిగమిస్తాడు.

ఒక ఏడాదిలో 1000 పరుగులు

ఒక ఏడాదిలో 1000 పరుగులు

ఒక క్యాలెండర్ ఇయర్‌లో వన్డేల్లో వెయ్యి పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ అగ్రస్ధానంలో ఉన్నాడు. 1994 నుంచి 2007 మధ్య ఏడుసార్లు సచిన్ ఈ రికార్డు సాధించాడు. కాగా ఇప్పటికే కోహ్లీ ఐదుసార్లు మాత్రమే ఏడాదికి వెయ్యి పరుగుల చొప్పున సాధించాడు. కోహ్లీ వచ్చే ఐదేళ్లలో మూడేళ్లు ఏడాదికి వెయ్యి పరుగులు చేసినా.. సచిన్ రికార్డును అధిగమిస్తాడు.

వన్డేల్లో సచిన్ పరుగుల రికార్డుని అధిగమించే ఛాన్స్

వన్డేల్లో సచిన్ పరుగుల రికార్డుని అధిగమించే ఛాన్స్

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ వన్డేల్లో 18426 పరుగులు చేశాడు. ఈ రికార్డును బహుశా ఎవరూ బద్దలు కొట్టలేకపోవచ్చు. వన్డేల్లో కోహ్లీ ఇప్పటివరకు 9030 పరుగులు చేశాడు. వన్డేల్లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ 18వ స్థానంలో ఉన్నాడు. కేవలం 11 మంది క్రికెటర్లు మాత్రమే వన్డేల్లో పది వేలకు పైగా పరుగులు సాధించారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ వయసు 29 ఏళ్లు కాబట్టి వచ్చే ఐదేళ్లలో 6 వేల పరుగులు చేసినా 15 వేల పరుగుల మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది.

విరాట్ కోహ్లీ సెంచరీల రికార్డు

విరాట్ కోహ్లీ సెంచరీల రికార్డు

విరాట్ కోహ్లీ ఇప్పటికే 51 సెంచరీలు సాధించాడు. 2017లో కోహ్లీ పది సెంచరీలు సాధించాడు. ఇదే ఫామ్‌ని కొనసాగిస్తే వచ్చే ఐదేళ్లలో 75కిపైగా సెంచరీలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుత షెడ్యూల్‌ని చూస్తే టీమిండియా ఏడాదికి 25 వన్డేలు, 10 నుంచి 12 టెస్టులు, 10 టీ20లు ఆడుతోంది. ఇదే దూకుడుని కోహ్లీ కొనసాగిస్తే వన్డేల్లో అత్యంత వేగంగా 50 సెంచరీల రికార్డుని నెలకొల్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

63 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు

63 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు

వన్డేల్లో సచిన్‌ ఇప్పటివరకు అత్యధికంగా 63 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు అందుకున్నాడు. రెండు ఫార్మాట్లూ కలుపుకొని సచిన్ 76 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు అందుకోగా... ఆ తర్వాతి స్థానంలో సనత్ జయసూర్య (58), జాక్వస్ కలిస్ (57)లు ఉన్నారు. వన్డేల్లో 25, టెస్టుల్లో 6, టీ20ల్లో పది కలుపుకుంటే కోహ్లీ ఖాతాలో ఇప్పటి వరకూ 41 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు ఉన్నాయి. మరో 36 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు సాధిస్తే.. సచిన్ రికార్డుని అధిగమిస్తాడు.

Story first published: Thursday, November 30, 2017, 17:51 [IST]
Other articles published on Nov 30, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+