Virat Kohli: విరాట్ రిటైర్ అయితే మిస్సయ్యే 5 భారీ రికార్డులు ఇవే..
Virat Kohli Records: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్ నుంచి ఎప్పుడైనా రిటైర్ కావచ్చు. కోహ్లీ రెడ్ బాల్ క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే విరాట్ ఇప్పుడు రిటైర్ కావడం బీసీసీఐకి ఇష్టం లేదు. తన నిర్ణయంపై మళ్లీ ఒకసారి ఆలోచించుకోవాలని బీసీసీఐ విరాట్ కోహ్లీని కోరింది. ఇప్పుడు విరాట్ తన నిర్ణయాన్ని మార్చుకుంటాడో లేదో చూడాలి. విరాట్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే టెస్టుల్లో అనేక రికార్డులను కోల్పోతాడు. విరాట్ కోహ్లీ మిస్సయ్యే 5 రికార్డుల గురించి తెలుసుకుందాం.
ఇంగ్లాండ్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు
విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తే అక్కడ అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచే అవకాశం కూడా ఉంటుంది. ఇంగ్లాండ్‌లో 17 టెస్టుల్లో విరాట్ కోహ్లీ 33 సగటుతో 1096 పరుగులు చేశాడు. ఇంగ్లీష్ గడ్డపై సచిన్ 30 ఇన్నింగ్స్‌ల్లో 54 సగటుతో 1575 పరుగులు చేశాడు. ఈ పర్యటనలో దానిని అధిగమించే అవకాశం ఉంటుంది.

టెస్ట్ మ్యాచ్‌ల్లో 10 వేల పరుగులు
వన్డే, టెస్ట్ క్రికెట్‌లో 10 వేల పరుగులు చేసిన గొప్ప బ్యాటర్‌గా రికార్డు సాధించనున్నాడు. విరాట్ కోహ్లీ వన్డేల్లో ఈ రికార్డును ఎప్పుడో దాటాడు కానీ ప్రస్తుతం టెస్టుల్లో 9230 పరుగులు మాత్రమే చేశాడు. విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్ నిర్ణయానికి కట్టుబడి ఉంటే 10 వేల పరుగులు పూర్తి చేయడానికి ముందే టెస్ట్ క్రికెట్‌ను వదిలివేసినట్లు అవుతుంది.
అత్యధిక టెస్ట్ విజయాలు
భారత్ ఇప్పటివరకు 589 టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా.. ఆ జట్టు 181 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. సచిన్ టెండూల్కర్ గరిష్టంగా 72 విజయాలలో ప్లేయింగ్ 11లో భాగంగా ఉన్నాడు. విరాట్ 62 మ్యాచ్‌ల విజయాల్లో భాగమయ్యాడు. సచిన్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది కానీ విరాట్ రిటైర్ అయితే వెనుకబడిపోతాడు.
గెలిచిన టెస్టులలో అత్యధిక పరుగులు
భారత్ గెలిచిన టెస్ట్ మ్యాచులలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచే అవకాశం కూడా ఉంది. సచిన్ టెండూల్కర్ 72 టెస్టుల్లో 113 ఇన్నింగ్స్‌ల్లో 5946 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 4746 పరుగులు చేశాడు. సచిన్ రికార్డును బద్దలు కొట్టాలంటే కోహ్లీకి 1201 పరుగులు అవసరం.
డబ్ల్యూటీసీలో భారత్ తరఫున అత్యధిక పరుగులు
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. భారత మాజీ కెప్టెన్ 40 మ్యాచ్‌ల్లో 2716 పరుగులు చేశాడు. రోహిత్ రిటైర్ అయ్యాడు. విరాట్ 46 మ్యాచ్‌ల్లో 2617 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఒకవేళ విరాట్ రిటైర్ అయితే రోహిత్ రికార్డు చెక్కు చెదరకుండా ఉంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications