IPL 2025: ఐదుగురు కీలక ఆటగాళ్లు దూరం.. వీరిలో ముగ్గురు భారత్ నుంచే!
IPL 2025 Injured Players : మరో 9 రోజుల్లో ఐపీఎల్ 2025 ప్రారంభం కానుంది. మార్చి 22నుంచి షురూ కానున్న ఈ మెగా లీగ్ లో.. టైటిల్ సాధించడమే లక్ష్యంగా ఈ సారి కూడా 10 జట్లు పోటీ పడుతున్నాయి. తొలి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది. అయితే న్యూస్ 18 కథనం ప్రకారం.. ఈ సీజన్ లో పలువురు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా తప్పుకుంటున్నారని తెలిసింది. మరి కొంతమంది ఆడతారా లేదా అనేది అనుమానంగా మారింది. ఇంతకీ వారెవరంటే?
మయాంక్ యాదవ్
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్.. పేసర్ మయాంక్ యాదవ్‌ను రూ.11 కోట్లకు రిటైన్ చేసుకుంది. దిల్లీకి చెందిన ఈ ఫాస్ట్ బౌలర్.. ఐపీఎల్ 2025 ఫస్ట్ హాఫ్ సీజన్ కు అందుబాటులో ఉండడని తెలిసింది. ప్రస్తుతం అతడు నడుము గాయం నుంచి కోలుకుంటున్నాడని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టాడని సమాచారం అందింది.
జస్ప్రీత్ బుమ్రా
ఇండియన్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రాను ముంబయి ఇండియన్స్ రూ.18 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఇతడు లోయర్ బ్యాక్ ఇంజూరి కారణంగా 2025 జనవరి 5 నుంచి ఆటకు దూరంగా ఉంటున్నాడు. అయితే అతడు రీసెంట్ గానే తిరిగి బౌలింగ్ సాధన ప్రారంభించాడు. కానీ ఈ ఐపీఎల్ మొదటి రెండు వారాలు అందుబాటులో ఉండడని తెలిసింది.
హార్దిక్ పాండ్యా
మార్చి 23న చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే తొలి మ్యాచ్‌కు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉండడు. గత సీజన్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన ముంబయి ఆఖరి గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌లో స్లో ఓవర్-రేట్ కారణంగా ఒక మ్యాచ్ సస్పెండ్ అయ్యాడు హార్దిక్. ఆ సస్పెండ్.. ఈ ఐపీఎల్ సీజన్ మొదటి మ్యాచ్‌కు వర్తిస్తుంది.
మిచెల్ మార్ష్
ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ మిచెల్ మార్ష్ ను.. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టు రూ.3.40 కోట్లకు దక్కించుకుంది. అయితే ఇతడు వెన్నుముక గాయం కారణంగా ఐపీఎల్ ఫస్ట్ హాఫ్ సీజన్ కు అందుబాటులో ఉండట్లేదు. ఈ లోయర్ బ్యాక్ పెయిన్ కారణంగా అతడు ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి కూడా అతడు ఆడలేదు.

జోష్ హెజిల్‌వుడ్
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ హెజిల్‌వుడ్‌ను మెగా వేలంలో ఆర్సీబీ రూ.12.50 కోట్లకు దక్కంచుకుంది. కానీ ఇప్పుడతడు హిప్ ఇంజ్యూరీ కారణంగా ఆటకు దూరంగా ఉంటున్నాడు. దీంతో అతడు IPL 2025లో ఆడతాడా లేడా అనేది ఇంకా స్పష్టత రాలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications